భోళా శంకర్ రిలీజ్ ఎప్పుడంటే

భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్.  2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగాది సందర్భంగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సెలవు (మంగళవారం) కారణంగా లాంగ్ వీకెండ్ ను ఈ చిత్రం సద్వినియోగం చేసుకోనుంది. అంతేకాదు, మెగా అభిమానులకు పెద్ద పండుగ అంటే చిరంజీవి బర్త్ డే, అది కూడా ఆగస్ట్ 22 అది కూడా కలసి వచ్చేటుగా మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల తేదీని నిర్ణయించారు.

కాగా ఉగాది సందర్భంగా భోళా శంకర్ మూవీ మేకర్స్ చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నాలతో కూడిన ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నటీనటులు తమ సంప్రదాయ దుస్తులలో కనిపించారు.  ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.  ఈ సినిమాలో సుశాంత్ వెరీ స్పెషల్ లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా భోలా శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రంలో రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్నారు. డుడ్లీ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఇక చిరంజీవి చివరి సినిమా విషయానికొస్తే ఆయన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో చిరంజీవి వరుస పరాజయాలు చవిచూడటంతో వాల్తేరు వీరయ్యపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ విజాగ్ జగదాంబ థియేటర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వాల్తేరు వీరయ్య రికార్డు సరుసతినచ్చింది. గతంలో ఈ రికార్డు ఆర్ఆర్ఆర్ పేరిట ఉండేది. వాల్తేరు వీరయ్య కూడా అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల మార్కును దాటేశాడు. చిరంజీవి కెరీర్ లో యూఎస్ లో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డు సృష్టించింది. గతంలో ఆయన నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాలు ఈ జాబితాలో చేరాయి.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh