CORONA VIRUS:ప్రజలను కలవర పెడుతున్న కరొన
దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,435 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం డేటాను విడుదల చేసింది. కిందటి రోజుతో(3,038 కేసులు) పోలిస్తే కరోనా కేసుల్లో 46 శాతం పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు (4,47,33,719) పెరిగింది.
గత 24 గంటల్లో 15 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,916కి పెరిగింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నవారి దాంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.38శాతానికి చేరింది. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 23,091(0.05శాతం)కి ఎగబాకాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.6 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
గత ఏడు రోజుల్లో రెట్టింపు కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళలో కరోనా కేసుల సంఖ్య ఒక వారంలో 1333 నుండి దాదాపు 4000కి మూడు రెట్లు పెరిగింది. గోవా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ లలో కోరనా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే ఈ వారంలో కరోనా కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. గత వారం హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు 409 నుండి 1200కి పెరిగాయి.
రెండో స్థానంలో మహారాష్ట్ర
మహారాష్ట్ర, గుజరాత్‌లలో గత కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే మహారాష్ట్రలో స్థిరంగా ఉండగా గుజరాత్‌లో తగ్గింది. మహారాష్ట్రలో ఈ వారం కరోనా కేసుల సంఖ్య 3323, ఇది గత ఏడు రోజుల్లో (1956 కేసులు) నమోదైన కేసుల కంటే 70 శాతం ఎక్కువ. 550కి పైగా కేసులు నమోదయ్యాయి. హర్యానాలో పెరుగుతున్న కొవిడ్ -19 కేసులతో పాజిటివిటీ రేటు 4 శాతానికి చేరుకుంది. ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ కోరారు. నిన్న వైద్యారోగ్య శాఖ సీనియర్ అధికారుల సమావేశం కూడా జరిగింది