గోల్డ్ ఏడాదిలో ఈ ధరకు చేరుకోవడం ఇదే తొలిసారి

GOLD PRICE: గోల్డ్ ఏడాదిలో ఈ ధరకు చేరుకోవడం ఇదే తొలిసారి

దేశవ్యాప్తంగా రోజురోజుకి మార్కెట్ లో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయాలి అంటేనే భయపడుతున్నారు.

అంతే కాకుండా బంగారం తగ్గుతుంది అనుకుంటున్నా కొద్ది అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బంగారం పేరు వింటేనే కొంతమంది హడలెత్తిపోతున్నారు. బాబోయ్ బంగారమా ఇప్పట్లో మనం కొనలేము అంటూ చేతులెత్తేస్తున్నారు.

బంగారం పేరు వింటేనే కొంతమంది హడలెత్తిపోతున్నారు. బాబోయ్ బంగారమా ఇప్పట్లో మనం కొనలేము అంటూ చేతులెత్తేస్తున్నారు. చాలామంది పసిడి ప్రేమికులు సైతం బంగారం పై ఆశలు వదిలేసుకుంటున్నారు

బంగారం కొనాలనుకునే వారికి షాక్ తగిలింది. నిన్న భారీగా తగ్గిన బంగారం నేడు రెట్టింపు ధర నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఒక్కసారిగా బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో బంగారం ధర పెరిగింది. ఏడాదిలో ఈ ధరకు చేరుకోవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2020 డాలర్లు దాటేసింది. ప్రస్తుతం (08.15 IST ) అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 2024.20 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 25.12 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇలా బంగారం, వెండి ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిన్న స్పాట్ గోల్డ్ ధర రూ. 1978 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వగా.. వెండి 23.87 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఒక్కరోజులో 40 డాలర్లు పైనే గోల్డ్ రేటు పెరిగింది.

దేశంలో పలు నగరాల్లో బంగారం ధర రూ.61 వేలను దాటేసింది. అటు వెండి కూడా ఇదే బాటలో ప్రయాణిస్తోంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు పై రూ. 10 పెరిగి రూ. 55,310కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు పై రూ.19 పెరిగి రూ.69,340కి చేరుకుంది.

హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,300 కి, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1000 రూపాయలు పెరిగి రూ.60,330 కి చేరుకుంది. ఇక ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,360 గా ఉంది. అలాగే ఢిల్లీలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61, 510 గా ఉంది. ఇకపోతే హైదరాబాద్‌లో మరో విలువైన లోహం వెండి ధరలను పరిశీలిస్తే కేజీ వెండి నిన్న రూ. 600 తగ్గి 77,100 గా ఉన్న వెండి ఈ రోజు రెండు రెట్లు పెరిగింది.ఏకంగా రూ. 2900 పుంజుకుంది. కిలో ధర రూ.77800గా ఉంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh