Bandi Sanjay Kumar:పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు
వరంగల్ లో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హన్మకొండ కోర్టుకు హాజరుకాగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కాగా ఈ రోజు ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత కరీంనగర్ లోని ఆయన నివాసానికి ఓ చిన్న బృందం చేరుకోగానే పోలీసులు ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ జిల్లా కోర్టుకు తీసుకెళ్తుండగా భరత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యులు ఆయన కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అరెస్టుపై విచారణ జరిపేందుకు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సంజయ్ తో పాటు మరో బీజేపీ ఎమ్మెల్యే దుబ్బాక రఘునందన్ రావు సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ లీకేజీకి సంబంధించి ప్రశాంత్ అనే రెండో నిందితుడితో సందేశాలు పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంజయ్ తదితరుల అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ నాయకత్వం కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తోంది.
బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు లో విచారణ జరిగింది. హనుమకొండ కోర్టు డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు 41ఏ నోటీస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని అడిగింది. లోయర్ కోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. మరికాసేపట్లో బండి సంజయ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బండి సంజయ్ వాట్సాప్‌లో సర్క్యులేట్ చేశారు తప్ప, పేపర్ లీక్‌లో ఆయన ప్రమేయం ఎక్కడుందన్న ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక రాజకీయ నేతగా సర్కులేట్ చేయంటంలో తప్పేంటని అడిగింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ పేపర్ లీక్ ఘటనలో బండి సంజయ్ కుట్రదారుడని వాదించారు. బండి సంజయ్ ఫోన్ ఇంకా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అయితే ఎల్లుండి ప్రధాని పర్యటన ఉన్నందున బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు ముగిసేలా ఆదేశాలివ్వాలని కోరారు.