నేను కోర్టుకు రాలేను :ఏపీ సిఎం

ap cm జగన్ :నేను కోర్టుకొస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులొస్తాయ్‌

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో  మంగళవారం (మార్చి 7)  జరిగిన విషయం తెలిసిందే.  అయితే కోర్టు గత విచారణ సందర్భంగా విస్పష్టంగా ఆదేశించినా ఈ కేసులో బాధితుడు జగన్  హాజరు కాకపోవడంతో విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా బాధితుడు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మరో మారు ఆదేశించింది.

ఈ  కేసును నేడు విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ కేసులో బాధితునిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు రావాలని గత వాయిదా సందర్భంగా మెజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ ఇప్పటికే కోర్టును అభ్యర్ధించారు.  ఈ మేరకు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే సీఎం కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అడ్వకేట్ కమిషనర్ ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలి” అని పిటిషన్లో జగన్ అభ్యర్థించారు.వీడియో కాన్ఫరెన్స్ లేదా ఇతర మార్గాల ద్వారా సాక్ష్య, నమోదు చేయాలంటూ పిటిషన్ లో కోరడం వల్ల ఎస్ఐఏ కోర్టున్యాయమూర్తి విచారణ షెడ్యూల్ ను రద్దు చేశారు. తదుపరి విచారణ ఈనెల 13న విచారణ జరుపుతామని ఎస్ఐఏ కోర్టు తెలిపింది. అలాగే  ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలంటూ మరో పిటిషన్ కూడా కూడా సీఎం దాఖలు చేశారు.

అసలు ఈ ఘటన జరిగి నాలుగేళ్లు దాటిపోయింది.  చార్జిషీటు  కూడా దాఖలు అయ్యింది ప్రతీ వాయిదాకు   నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు హాజరు పరుస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ కూడా ఈ సారి హాజరయ్యారు. ఆయనను కోర్టు ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది. మరోసారి బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ ఎన్ఐఏ కోర్టు తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసీన విషయం తెలిసిందే.

కానీ బాధితుడు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప విచారణ ముందుకు సాగదు. ఈ కేసులో నిందితుడిగా నాలుగేళ్లుగా కటకటాల వెనుక ఉన్న నిందితుడికి కనీసం బెయిలు కూడా రాదు. ఎందుకంటే ఇది ఎన్ఐఏ కేసు అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి వెనుక ఉగ్ర కుట్ర ఉందంటూ ఈ కేసు విచారణ ఎన్ఐఏకు అప్పగించారు.  ఇక తాజా విచారణలో అప్పట్లో జగన్ పై దాడికి ఉపయోగించిన  కోడి కత్తి గురించి సైతం ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ఆరా తీశారు. దానిని తమ ముందు ప్రవేశ పెట్టాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించారు. ఈ కేసులో బాధితుడైన జగన్  కోర్టుకు హాజరై జరిగిందేమిటో వాంగ్మూలం ఇస్తేనే కేసు విచారణ  కొలిక్కి వస్తుందంటున్నారు. మరి తనపై దాడి చేసిన వ్యక్తికి శిక్ష పడేలా చేయడానికైనా జగన్ కోర్టుకు రావాల్సి ఉంటుంది. తాను నిందితుడిగా ఉన్న కేసులలో హాజరుపై మినహాయింపు కోరుతున్న జగన్ తాను బాధితుడిగా ఉన్న కేసులోనూ కోర్టుకు హాజరు కావడానికి ఎందుకు సుముఖంగా లేరన్నది ఆయనే చెప్పాల్సి ఉంది. కాగా ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్ర‌మ్మ గత ఏడాది జులైలో అప్పటి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌కు తన కుమారుడిని విడుదల చేయాలంటూ లేఖ రాశారు. నాలుగు సంవ‌త్స‌రాల నుంచి త‌న కుమారుడు రిమాండ్ ఖైదీగానే ఉన్నాడనీ, ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకానీ, న్యాయ‌స్థానం కానీ  విచార‌ణ జ‌ర‌ప‌డంలేద‌ని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh