నేడు స్వల్పంగా తగ్గిన పసిడి రేట్లు

Today Gold Price:నేడు స్వల్పంగా తగ్గిన పసిడి రేట్లు

బంగారం కొనాలి అనుకునేవాళ్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే  గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం తగ్గుతోంది. నేడు కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారంతో పోల్చితే పసిడి ధర అతి స్వల్పంగా తగ్గింది. ఆదివారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలు ఉండగా, సోమవారం 55,790 రూపాయలుగా ఉంది. 10 గ్రాములపై కేవలం 10 రూపాయలు తగ్గడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం ధరలో కూడా ఇదే మార్పు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఏప్రిల్ 9న రూ.60,870 ఉండగా, ఏప్రిల్ 10న 60,860 రూపాయలకు తగ్గింది. అతి స్వల్పంగా పది గ్రాములపై పది రూపాయలు మాత్రమే తగ్గడం గమనార్హం.

ఈ పది రోజుల్లో చూసుకుంటే.. ఏప్రిల్ 4, ఏప్రిల్ 5న.. ఈ రెండు రోజులు మాత్రం బంగారం ధర ఊహించని రీతిలో పెరిగింది. ఏప్రిల్ 4న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 600 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 660 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 5న అయితే పసిడి ధర రివ్వున తారాజువ్వ మాదిరిగా దూసుకెళ్లింది. ఏప్రిల్ 5న 22 క్యారెట్ల బంగారం ధరపై 950 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధరపై 1030 రూపాయలు పెరగడం గమనార్హం. ఆ తర్వాత అడపాదడపా ధర తగ్గిందే తప్ప చెప్పుకోతగిన స్థాయిలో తగ్గిందేమీ లేదు.

అలాగే వెండి ధరల విషయానికొస్తే ఆదివారం ఏ ధర అయితే ఉందో సోమవారం కూడా అదే ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.76,600 రూపాయలుగా ఉంది. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం వెండి కాస్తంత ప్రియంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 80,200 రూపాయలుగా ఉంది.

నేడు ఉదయం 8.45 గంటలకు స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1990.92 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 24.74 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో సోమవారం నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

హైదరాబాద్ లో 22క్యారెట్లు  రూ. 55,790, 24 క్యారెట్లు రూ.60,860, చెన్నై లో 22క్యారెట్లురూ.56,390, 24 క్యారెట్లు రూ.61,520, ఢిల్లీ లో 22క్యారెట్లు రూ.55,940,24 క్యారెట్లు  రూ.61,010  బెంగళూరులో 22క్యారెట్లు రూ.55,840, 24 క్యారెట్లు రూ.60,910, కోల్‌కత్తా లో 22క్యారెట్లు రూ.55,790, 24 క్యారెట్లురూ.60,860 , అహ్మదాబాద్లో 22క్యారెట్లు రూ.55,840, 24 క్యారెట్లురూ.60,910 (24K),భువనేశ్వర్ లో 22క్యారెట్లు రూ.55,790, 24 క్యారెట్లు రూ.60,860  వున్నాయి.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh