IPL 2023 :ఆరంభ వేడుకలలో నాటు నాటు డాన్స్ తో అదరగొట్టనున్న రామ్ చరణ్ ఎన్టీఆర్
క్రికెట్ ఫ్యాన్స్‌కు నాన్‌స్టాప్ వినోదం అందించే ఐపీఎల్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో పాన్ ఇండియా స్టార్లు రామ్ చరణ్-ఎన్టీఆర్ సందడి చేయనున్నారు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సరిగ్గా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 31న అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్‌తో ఐపీఎల్ 2023కు తెరలేవనుంది. ఇప్పటికే లీగ్ నిర్వహణపై బీసీసీఐ కసరత్తులు ముమ్మరం చేసింది.
అయితే కరోనా కారణంగా గత మూడేళ్లుగా కొన్ని సెలెక్టడ్ వేదికల్లో మాత్రమే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించిన బీసీసీఐ. ఈ సారి దేశవ్యాప్తంగా ఆయా ఫ్రాంచైజీల సొంత అడ్డాలో మ్యాచ్‌లు జరగనున్నాయి. హోమ్ అండ్ అవే ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీంతో చాలా కాలం తర్వాత ఐపీఎల్‌కు పూర్తి స్థాయి పూర్వవైభవం రానుంది. అలాగే కరోనా కారణంగా కనుల పండువగా జరిగే ఆరంభ వేడుకలు సైతం మూడేళ్లుగా నిర్వహించడం లేదు.
కరోనా నేపథ్యంలో గత మూడేళ్లు ఐపీఎల్ ఆరంభ వేడుకలను నిర్వహించలేదు. కాకపోతే గతేడాది ముగింపు వేడుకలను జరిపారు. ఈ వేడుకల సందర్భంగా అతిపెద్ద ఐపీఎల్ జెర్సీని ఆవిష్కరించారు. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తన డ్యాన్స్‌లతో అభిమానులను అలరించాడు. ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌కు చిందేసి అభిమానులను ఎంటర్టైన్ చేశాడు.
ఈ సారి ఆరంభం వేడుకలను అట్టహాసంగా నిర్వహించి, క్రికెట్ అభిమానులకు కనుల విందును అందించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఆస్కార్ అవార్డ్ అందుకున్న నాటు నాటు పాటను ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభ వేడుకల్లో భాగం చేసేందుకు బీసీసీఐ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ హీరోలు, పాన్ ఇండియా స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో నాటు నాటు డ్యాన్స్ చేయించే ప్రణాళిక రచించినట్లు బీసీసీఐ పెద్దలు తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై సదరు హీరోలతో చర్చలు జరిపినట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు.
హీరోలతో పాటు సౌతిండియా బ్యూటీస్ రష్మిక మంధన్నా, తమన్నాలతో పాటు మరికొంత మంది మేల్, ఫిమేల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లు ఈ వేడుకల్లో భాగమయ్యే అవకాశాలున్నాయి. ఈ స్టార్ హీరోయిన్ల డ్యాన్స్‌తో ఆరంభం వేడుకలు దద్దరిల్లనున్నాయి.