సంచలనం రేపిన సుఖేష్ ‌‌– కవిత వాట్సాప్ చాటింగ్

MLC Kavitha: సంచలనం రేపిన సుఖేష్ ‌‌– కవిత వాట్సాప్ చాటింగ్

ప్రస్తుతం రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సుఖేశ్‌ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. ఆప్‌ నేతలపై కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు డబ్బులు ఇచ్చినట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వాట్సాప్ చాట్ రిలీజ్ చేయటంతోపాటు దీనిపై విచారణ చేయాలని సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జి, గవర్నర్, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాయటం సంచలనంగా మారింది.

మరో బాంబ్ పేల్చాడు. సీఎం కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాటింగ్ ఇదేనంటూ మరోసారి సంచలనంగా మారాడు. అయితే ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా ఈ తతాంగం నడుపుతున్నాడు.

దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం ప్రస్తుతం ఈడీ చూస్తుంది. లిక్కర్ స్కాములో నిందితులని, అనుమానితులని ఇప్పటికే పలు మార్లు విచారించింది. ఈ క్రమంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని కస్టడీకి తీసుకుంది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. అయితే ఈ కథలో మనీలాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో కవిత హస్తం ఉందంటూ వార్తల నేపథ్యంలో సుఖేష్ చాటింగ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుఖేష్ చంద్రశేఖర్ జైలుకెళ్లాడు. అయితే తన తరుపు లాయర్ ద్వారా కవితతో చేసిన చాటింగ్ వివరాలను లీక్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు ఆధారాలు బయటపెట్టగా నేడు మరో బాంబ్ పేల్చాడు.

సుఖేష్ బయటపెట్టిన స్క్రీన్ షాట్ లో కవిత అక్క టీఆర్ఎస్ అనే పేరుతో కాంటాక్ట్ సేవ్ అయి ఉంది. ఈ వాట్సాప్ చాటింగ్ కోడ్ భాషతో సాగింది. పలు మార్లు అక్క అక్క అంటూ చాటింగ్ సాగింది. డబ్బు డెలివరీ చేశానంటూ చాటింగ్ లో పేర్కొన్నాడు. గతంలో కూడా సుఖేష్ పలు చాటింగ్ వివరాలను బయటపెట్టాడు. అందులో కూడా కోడ్ భాషనే వాడారు. ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్ అని ఎస్ జే అంటే సత్యేంద్రజైన్  మనీష్ అంటే మనీష్ సిసోడియా అరుణ్ అంటే అరుణ్ పిళ్లై అని జేహెచ్ అంటే జూబ్లీహిల్స్ అని ఆఫీస్ అంటే పార్టీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద టీఆర్ఎస్ అని ప్యాకేజీ అంటే 15 కోట్ల రూపాయలు అని కోడ్ వాడినట్టు సుఖేష్ తెలిపాడు.

బ్రో అంటే సత్యేంద్రజైన్ అని 15కేజీ నెయ్యి అంటే 15 కోట్ల రూపాయల డబ్బు అని 25 కేజీ నెయ్యి అంటే 25 కోట్ల రూపాయలు అని సిస్టర్ అంటే కె.కవిత అని ఏకే భాయ్ అంటే అరవింద్ కేజ్రీవాల్ అని కోడ్ భాష వివరాలను రివీల్ చేశాడు సుఖేష్..

సుఖేష్ చాటింగ్ పై బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం కాగా.. సుఖేష్ కు తెలుగు వచ్చా అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. కవిత బ్రో అని సంబోధిస్తే కవిత అక్కా అంటూ తెలుగు సుఖేష్ మాట్లాడటం విశేషం.

ఈ వ్యవహారం అంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిందేనని స్పష్టంగా తెలుస్తోంది. అయితే సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ వ్యవహారం మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కాదు. ఇతర కేసుల్లో. మరి సుఖేష్ నుంచి స్వాధీన చేసుకున్న ఫోన్.. కవిత ఇచ్చిన ఫోన్లలో ఈ వాట్సాప్ చాట్ బయటపడితే. ఏం జరుగుతుందో కానీ ఇప్పటికిప్పుడు ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదు. ప్రస్తుతం కాలికి ఫ్రాక్చర్ కావడంతో కవిత బెడ్ రెస్ట్ లో ఉన్నారు.

 

 

 

Leave a Reply