TILK VARMA: తెలుగు క్రికెటర్ పై ప్రశంసల వర్షం
గత సీజన్లలో చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లో మాత్రం చతికిలపడింది. ఇందులో రోహిత్ శర్మ (1), ఇషాన్ కిషన్ (10), కెమెరూన్ గ్రీన్ (5), సూర్యకుమార్ యాదవ్ (15), టిమ్ డేవిడ్ (4), నేహాల్ (21), హృతిక్ (5) పరుగులు మాత్రమే చేశారు. ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (46 బంతుల్లో 84 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకున్నాడు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నాఒంటరి పోరాటంతో ముంబైకి పోరాడే స్కోరు అందించాడు.
అయితే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అసలు అద్భుతమైన బ్యాటింగ్ లైన్ అప్ కలిగిన ముంబై టీమ్ లో తిలక్ మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ఒక వైపు వికెట్లు పడిపోతున్నతిలక్ లో ఏ మాత్రం వణుకు లేదు. నిజానికి వరుస పెట్టి బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతుంటే ఏ బ్యాటరైనా ఆత్మ రక్షణలో ఆడతాడు కానీ తినక్ రూటే సపరేటు వికెట్లు పడుతున్న కొద్దీ అటాకింగ్ గేమ్ ఆడాడు బౌలర్ల కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీసేందుకు చేయాల్సిందంతా చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో విరుచుకుపడ్డాడు మెగా వేలంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అవకాశం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసినదే. కాగా 1.5 కోట్లు వెచ్చించి ఈ యువ ఆటగాడిని ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్నముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
అయితే ఇక తిలక్ వర్మ పై ముంబాయిం ఇండియన్స్ జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతున్న యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతేకాదు అతను చూడటానికి భారీ సిక్సర్లు ఆడగలడు అన్నట్లుగా అస్సలు కనిపించడూ. కానీ ఎంతో అలవోకగా భారీ సిక్సర్లు ఫోర్లు కొడుతూ ప్రస్తుతం అందరి చూపులను తనవైపు తిప్పుకుంటున్నాడు. గత సీజన్ లోనూ మెరిసిన ఈ తెలుగు బిడ్డ ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే దుమ్ము రేపాడు. ఆఖరి బంతికి అతను కొట్టిన హెలికాప్టర్ షాట్ ఇన్నింగ్స్‌కే హైలైట్.
గత సీజన్‌లోనూ టాప్ ఆటగాళ్లంతా విఫలమైన వేళ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు మెరుగైన స్కోర్లు అందించాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌లో 397 పరుగులు చేసి ముంబై తరఫున సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అసాధారణ ప్రదర్శనతో ముంబై టీమ్‌లో విలువైన ఆటగాడిగా మారాడు. సహచరులందరూ ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోయి అసమాన పోరాటంతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.