డి. శ్రీనివాస్ కొడుకు ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి

Dharmapuri Sanjay: డి. శ్రీనివాస్ కొడుకు ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి

నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు సంజయ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం రెక్కీ నిర్వహించిన ఇద్దరు అగంతకులు.. స్కార్పియో వాహనంతో ఇంటి గేట్లను ధ్వంసం చేసి లోపలికి చొరబడేందుకు యత్నం చేశారు. సుమారు 20 నిమిషాలపాటు సంజయ్‌ ఇంటి వద్ద హంగామా సృష్టించారు ఉదయం ఆరున్నర గంటల నుంచి రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు.. ఇంటి లోపలికి చొరబడేందుకు యత్నించారు. దీనిపై ధర్మపురి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు.

పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను దీనిపై ఆరా తీస్తున్నారు. ఎందుకు దాడి చేశారు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సంజయ్ ఇంటిపై దాడి చేయించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దాడి జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తోన్నారు.

ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. ఈ నేపథ్యంలో దాడి జరగడం కలకలం రేపుతోంది. దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి బయటపెట్టాలని సంజయ్ అనుచరులు, కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి.అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దుండగులును అడ్డుకున్నారు. దీనిపై సంజయ్ అనుచరులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగా సంజయ్ ఇంటిపై దాడి చేశారా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

కాగా మాజీ మేయర్ సంజయ్ తన తండ్రి శ్రీనివాస్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజే తను కాంగ్రెస్‌లో చేరలేదని, కేవలం కొడుకును పార్టీలో చేర్పించినట్లు డీఎస్‌ చెప్పారు. దీనికితోడు కొంత కాలంగా డీఎస్‌ తనయులు అరవింద్‌, సంజయ్‌ల మధ్య రాజకీయ వైరం నడుస్తోంది.

ప్రస్తుతం డి.శ్రీనివాస్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఇటీవల కాంగ్రెస్ నేతల ఒత్తిడితో ఆ పార్టీలో చేరారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. కానీ 24 గంటలు కాకముందే పార్టీకి రాజీనామా చేశారు.

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh