ట్విటర్‌ బాస్‌ మస్క్‌కి షాక్ ఇచ్చిన మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌

twitter:ట్విటర్‌ బాస్‌ మస్క్‌కి షాక్ ఇచ్చిన మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌కి మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సహా తొలగించబడిన మాజీ ఎగ్జిక్యూటివ్‌లు భారీ ఝలక్‌ ఇచ్చారు.

10 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలంటూ మస్క్‌ నేతృత్వంలోని ట్విటర్‌ పై దావా వేశారు.అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వ్యాజ్యాలు, ప్రభుత్వ విచారణలకు సంబంధించిన చట్టపరమైన ఖర్చులను చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

భారత సంతతికి చెందిన ట్విటర్‌ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, మాజీ లీగల్ హెడ్ విజయ గద్దె, మాజీ సీఎఫ్‌వో సెగల్ ముగ్గురూ చట్టపరంగా తమకు రావాల్సిన చెల్లింపులు చేయాలంటూ కోర్టుకెక్కారు. ఈ మేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ పలు ధపాల విచారణలో భాగంగా తామె వెచ్చించిన లీగల్ ఫీజులకు గాను ట్విటటర్ తమకు ఒక మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉందని ముగ్గురూ ఆరోపించారు.

ఏడాది అక్టోబర్‌లో మస్క్‌ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను44 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేశాడు ఎట్టకేలకు బిలియనీర్, టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . ఆయన ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోగానే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తరువాత భారీ ఖర్చు తగ్గించే చర్చల్లో భాగంగా పలుక కీలక మార్పులను చేపట్టిన మస్క్‌ ప్రధానం అప్పటి సీఈవో పరాగ్‌ అగర్వాల్, గద్దె,సెగల్‌కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను వెంటనే తొలగించారు. ఆయనతోపాటు ట్విట్టర్ లీగల్, పాలసీ, ట్రస్ట్ హెడ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌, జనరల్ కౌన్సెల్ సియన్ ఎడ్గెట్‌లను ఆయన తొలగించారు. సీఈవో పరాగ్ అగర్వాల్‌ను తొలగించగానే అదే ట్విట్టర్‌లో మీమ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. అయితే అంతటితో ఆగలేదు మాటల యుద్ధాన్ని కొనసాగించుతూ మస్క్ పరాగ్ అగర్వాల్ పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

కానీ ట్విట్టర్ పని తీరుపై శ్రద్ధ పెట్టాలని మాజీ సీఈఓపై కాదని మరికొందరు నెటిజెన్లు మండిపడుతున్నారు. పరాగ్ అగర్వాల్ నేతృత్వంలో ట్విట్టర్ అద్భుతమైన పనితీరు సాధించిందని, మెరుగైన వృద్ధిని కనపరిచిందని అతని అభిమానులు చెబుతున్నారు. ట్విట్టర్ మాజీ ఉద్యోగులు సైతం ఎలా మాస్క్ చర్యను ఖండిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలా మస్క్ ఇలాంటి రెచ్చగొట్టే వైఖరిని మానుకోవాలని చెబుతున్నారు.

Leave a Reply