చాలా కష్టం మీద గెలిచాం – KL రాహుల్

“వన్డే సిరీస్లో అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాం. అయితే, టెస్టు సిరీస్ ను విజయంతో ఆరంభించడం సంతోషంగా ఉంది. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైంది. నిజానికి ఈ పిచ్పై మొదటి మూడు రోజులు పరుగులు రాబట్టడం కష్టంగా తోచింది. కానీ రెండో ఇన్నింగ్స్లో బంగ్లా ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన విధానం మా బౌలర్లపై బాధ్యత మరింత పెంచింది. అంత సులువుగా వికెట్లు తీయడం సాధ్యం కాదని, అంత తేలికగా విజయం దక్కదని అర్థమైంది.

అయితే, మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇక మొదటి ఇన్నింగ్స్ 400 ప్లస్ స్కోరు చేయడం బ్యాటర్ల ప్రతిభకు నిదర్శనం. పుజీ, శ్రేయస్, రిషబ్ మెరుగ్గా రాణించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. టెస్టు మ్యాచ్ గెలవడం కంటే సంతోషం ఇంకొకటి ఉండదు. రెండు రోజుల పాటు కాస్త రిలాక్స్ అయి తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతాం” అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు.

కాగా వరల్డ్స్టు చాంపియన్షిప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టెస్టులో భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 188 పరుగుల తేడాతో గెలుపొందిన రాహుల్ సేన రెండు మ్యాచ్ల సిరీస్లో 1- 0తో ముందంజలో నిలిచింది. ఈ నేపథ్యంలో సారథి రాహుల్ మాట్లాడుతూ ఈ గెలుపును సమిష్టి కృషిగా అభివర్ణించాడు. అయితే, ఈ విజయం కోసం బాగా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

వన్డే సిరీస్ ను పరాజయంతో మొదలుపెట్టిన భారత్… ఆఖరి టెస్టు ఓడినా కూడా సిరీస్ కోల్పోని పటిష్టస్థితిలో టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. మొదటి టెస్టు ఆఖరి రోజు లాంఛనం లంచ్లోపే ముగిసింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 113.2 ఓవర్లలో 324 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో భారత్ 188 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh