క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేయనున్న మెగా పవర్ స్టార్

ఆర్ ఆర్ ఆర్  హిట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  ఇమేజ్  ప్రపంచ స్థాయికి ఎదిగింది .మెగాస్టార్ వారుసుడు గా అడుగు పెట్టినప్పటికి తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.రామ్ చరణ్ ఒకవైపు సినిమా రంగంలో సత్తా చాటుతూనే మరోవైపు వ్యాపార, క్రీడా రంగాల్లో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు ఇప్పటికే పోలో టీమ్ ఉండగా ఇప్పటికే ఈ మెగా హీరోకి పోలో టీమ్‌ ఉండగా ట్రూజెట్‌ పేరుతో ఎయిర్‌లైన్స్‌ రంగంలోనూ అడుగుపెట్టాడు. క్రీడలపై అమితాసక్తి చూపించే రామ్ చరణ్ ఇప్పుడు క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి. చెర్రీ ఐపీఎల్‌లో టీమ్ కొనుగోలు చేస్తున్నాడంటూ కథనాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే టీమ్‌గా ఉంది. ఇది కూడా తమిళనాడుకు చెందిన కావ్యా మారన్ ఓనర్‌గా ఉంటే ఏపీ నుంచి మాత్రం ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ ప్రాతినిథ్యం లేదు.  అయితే దీంతో రామ్‌చరణ్‌ ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి వైజాగ్ వారియర్స్‌ అనే పేరు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఐపీఎల్‌లో ఇప్పుడు కొత్త జట్లకు అవకాశం లేదు. గత ఏడాదే రెండు కొత్త ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇచ్చాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీలను బడా వ్యాపారవేత్తలు దక్కించుకున్నారు. గుజరాత్‌ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్స్ , లక్నో టీమ్‌ను సంజీవ్ గోయెంకా టీమ్ వేలంలో కొనుగోలు చేశాయి.

దీంతో ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పదికి చేరింది. ఇప్పట్లో ఈ సంఖ్యను పెంచే ఉద్దేశమైతే బీసీసీఐకి లేదు. కాబట్టి రామ్ చరణ్ ఐపీఎల్ జట్టును కొనుగోలు చేసే అవకాశం లేదు. కానీ, ఆయన ఒక క్రికెట్ జట్టును కొనుగోలు చేస్తుండటమైతే వాస్తవం. రామ్‌ చరణ్‌ కొనబోయేది ఐపీఎల్ జట్టు కాదు  ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో జట్టు. ఏపీలో యువ క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో గత ఏడాది ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ ప్రారంభమైంది. తొలి సీజన్‌ కూడా విజయవంతంగా ముగిసింది ఈ లీగ్‌లో పలువురు వ్యాపారవేత్తలు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు.

ఆరు జట్లతో గత ఏడాది జరిగిన సీజన్‌ ద్వారా పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. కాగా, ఈ ఏపీఎల్‌లో ఉన్న వైజాగ్ వారియర్స్ జట్టును కొనుగోలు  చేసేందుకు  రామ్ చరణ్ ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ మేరకు ఆ జట్టు యజమానులతో రామ్ చరణ్ టీమ్ చర్చలు జరుపుతోందని వైజాగ్ వారియర్స్ సీఈవో భరణి మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh