Karnataka Election: కర్ణాటక ఎన్నిక షెడ్యూల్ విడుదల
భారత ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్‌ను ప్రకటించింది. మే24తో కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పొలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. నేటి నుండే కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ ఈ సందర్భంగా ప్రకటించింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13న ఎన్నికల నొటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ 20, నామినేషన్ల పరిశీలన 21, నామినేషన్ల ఉపసంహరణకు 24 వ తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.
కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, కర్ణాటక అసెంబ్లీలో 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా మేజిక్ ఫిగర్ 113 గాఉంది. 2018 ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 80, జెడిఎస్ 37 స్థానాలలో గెలుపొందింది. మధ్యలో జరిగిన ఉప ఎన్నికలతో బీజేపీ బలం 119 స్థానాలకు పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ కు 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్నాటక రాష్ట్రంలో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే కర్నాటకలో మొత్తం 5. 21 కోట్ల మంది ఓటర్లు, కర్నాటకలో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.కర్నాకటలో మొత్తం 58, 282 పోలింగ్ కేంద్రాలు ఓటు హక్కు పొందిన 41,312 మంది ట్రాన్స్ జెండర్లు, ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓటు ఫ్రమ్ హోం’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ‘ఓటు ఫ్రమ్ హోం’ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు.
80ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే చాన్స్, దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం,తొలిసారి ఓటర్లు 9.17 లక్షలు మహిళల కోసం ప్రత్యేకంగా 13 వందలకు పైగా పోలింగ్ స్టేషన్లు, ఏర్పాటుచేస్తారు. అలాగే ఎన్నికల్లో ధన ప్రలోభాలను నివారించేందుకు స్పెషల్ టీమ్ లు
ఎన్నికల్లో ధనబలం వాడకాన్ని అరికట్టేందుకు కర్ణాటకలో తమ బృందాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఈసీ తెలిపింది.. గట్టి నిఘా ఉంచేందుకు 2400 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు. 19 జిల్లాల్లోని 171 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులపై పర్యవేక్షణ చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.