కన్నా బిడ్డను చంపి అనంతరం దంపతులు ఆత్మహత్య

 COUPLE SUICIDE: కన్నా బిడ్డను చంపి అనంతరం దంపతులు ఆత్మహత్య

 జిల్లాలోని చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉమ్మేతల అశోక్(30), అతని భార్య అంకిత ఆత్మహత్య చేసుకున్నారు. తాము చనిపోతే తమ చిన్నారి అనాధ అవుతుందని భావించారో ఏమో మూడు నెలల పసిపాపను తమతో పాటు తీసుకెళ్లారు. చిన్నారికి కూడా ఉరివేసి..ఆపై దంపతులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అశోక్ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే కుటుంబ కలహాల వల్లే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చిన్నారిని ఉరితీసే ముందు అశోక్ ఫుల్ వాల్యూమ్ తో టెలివిజన్ ఆన్ చేశాడు. అనంతరం దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. టీవీ శబ్దంతో భయాందోళనకు గురైన ఇరుగుపొరుగు వారు తలుపు తట్టారని పోలీసులు తెలిపారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా శిశువు, అంకిత మృతి చెందారు. అశోక్ ఇంకా ఊపిరి పీల్చుకోవడంతో వారు కిందకు దించారు కానీ కొద్ది నిమిషాల తర్వాత అతను మరణించాడు.

స్థానికుల సమాచారంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దంపతుల ఆత్మహత్యకు కారణాలు తెలియనప్పటికీ కుటుంబ కలహాలే ఆత్మహత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే అశోక్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 2021లో అంకితను వివాహం చేసుకున్నాడు. మూడు నెలల క్రితం అంకిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

సోమవారం రాత్రి అశోక్ తన తమ్ముడు రాఘవేంద్రతో కలిసి స్థానిక మార్కెట్కు కూరగాయలు తీసుకెళ్లేందుకు ఆటోలో వెళ్లాడు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా బిర్యానీ కొని ఇంటికి చేరుకున్న తర్వాత తిన్నారు. అనంతరం రాఘవేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh