ఒడిశా రానున్న ప్రధాని

ఒడిశాలో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించిన , క్షతగాత్రులను పరామర్శించనున్నా: ప్రధాని మోదీ

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 238 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలో పర్యటించనున్నారు. బాలాసోర్ లో ప్రమాద స్థలాన్ని సందర్శించి, అనంతరం కటక్ లోని ఆసుపత్రికి వెళ్తారని వారు తెలిపారు. రైలు ప్రమాదానికి సంబంధించి పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని మోడీ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు మూడు వేర్వేరు పట్టాలపై ప్రమాదానికి గురయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైళ్లకు చెందిన పదిహేడు బోగీలు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రాథమిక నివేదిక ప్రకారం సుమారు 900 మంది గాయపడ్డారు.  అయితే ప్రమాదం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరగడంతో, కొందరు ప్రయాణికులు ఆ సమయంలో డిన్నర్ చేస్తున్నారు. ఆ టైమ్‌లో ఈ ప్రమాదం జరగడంతో, బోగీల వద్ద ప్రజల ఆహార పదార్థాలు, చెప్పులు పడి ఉన్నాయి.

ఏడు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు, ఐదు ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడీఆర్ఏఎఫ్) యూనిట్లు, 24 ఫైర్ సర్వీసెస్ అండ్ ఎమర్జెన్సీ యూనిట్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్న బోగీలను మెషిన్లతో కట్ చేసి, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోగీల గ్లాస్‌లు, సీట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

మృతులు, క్షతగాత్రులను తరలించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎంఐ-17 హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ రైల్వేస్తో కలిసి ఐఏఎఫ్ సహాయక చర్యలను సమన్వయం చేస్తోందని ఈస్ట్రన్ కమాండ్ తెలిపింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్-గ్రేషియాను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. గాయాలు పాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల ఎక్స్-గ్రేషియాను అందించనున్నట్లు చెప్పారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh