ఏపీలో ముగిసిన క్యాబినెట్ సమావేశం

Andrra Pradesh :ఏపీలో ముగిసిన క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు ఇవే

ఏపీ రాజీకియాం మరింత వేడి మరింత రాజుకుంటూనే వుంటున్నది . ఇంకా ఎలక్షణాలకు ఏడాది సమయం వుండగా ఒక పార్టీ మిద ఒకపార్టీ  వ్యూహాలు చేస్తున్నారు . ఈ నేపద్యంలోనే  జగన్ సర్కార్ తన మంత్రివర్గంలో నలుగురు లేదా ఐదుగురు కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే క్యాబినేట్ కసరత్తు పూర్తైనట్లు సమాచారం.

ఈసారి క్యాబినెట్‌లోకి కొందరు ఎమ్మెల్సీలకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడమే కాకుండా

ప్రస్తుతం కొంతమంది మంత్రుల శాఖల్ని కూడా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఏఫ్రిల్ 7న గుడ్ ఫ్రైడే ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై ఈనెల 3న మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ ఆరుగురిని గెలిపించుకున్నారు. క్యాబినెట్‌లో తీసుకోవాలి అనుకునే వారినే ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టినట్లు తెలిసింది. అందువల్ల గెలిచిన ఆరుగురిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. రెండోసారి మంత్రివర్గ విస్తరణలోఎమ్మెల్సీలకు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. అందువల్ల ఈసారి ఎమ్మెల్సీలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీకి కాస్త వ్యతిరేకంగా రావడంతో సీఎం జగన్ అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. అందువల్లే ఎన్నికలకు ఏడాది ఉన్న సమయంలోమంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరుపుతారని తెలుస్తోంది. ఐతే దీనిపై వైసీపీ వర్గాల నుంచి అధికారిక సమాచారం ఏదీ లేదు. మంత్రులు సైతం అలాంటిదేమీ లేదని అంటున్నారు. ఇంకా పలు అంశాలు మిద కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

 

Leave a Reply