ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌


టీమిండియాకు కొత్త కిట్ స్పాన్సర్ రాబోతుంది. భారత జట్టుకు ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ గూడింగ్ (క్రీడా సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ)  కంపెనీ  ‘అడిడాస్’తో జతకట్టనుంది.  2020 నుంచి 2023 వరకూ భారత జట్టుకు  కిట్ స్పాన్సర్ గా వ్యవహరించిన ‘ఎంపీఎల్ స్పోర్ట్ తో ఆ ఒప్పందం’ ఈ నెల 31తో  ముగియనుంది . అయితే  ప్రస్తుతం  కెవాల్ కిరణ్  (కిల్లర్  జీన్స్) తాత్కాలిక కిట్ స్పాన్సర్ గా ఉన్న విషయం తెలిసిందే.

ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు. అయితే అంతకుముందు 2016 నుంచి 2020 వరకు నైక్‌ సంస్థ టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా వ్యహరించింది. ప్రపంచంలోని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్‌లలో ఒకటైన అడిడాస్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం. వెల్‌కమ్‌ అడిడాస్‌ అని జై షా ట్వీట్‌ చేశారు.

అయితే ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందింది అనే వివరాలు మాత్రం జై షా వెల్లడించలేదు అని చెప్పాలి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు 350 కోట్ల రూపాయలతో అడిడాస్ కిట్స్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా  వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియా  తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలబడబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కూడా కనిపించబోతుంది.

కాగా, 2023 నుంచి 2028 వరకు అంటే ఐదేళ్లపాటు టీమిండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌ వ్యవహరించనుంది. ఇందుకుగాను ఒక్కోమ్యాచ్‌కు రూ.65 లక్షలు చెల్లించనుంది. దీనిప్రకారం ఏటా సుమారు రూ.70 కోట్లు (ఐదేళ్లకు రూ.350 కోట్లు) చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని సమాచారం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh