హార్దిక్ పాండ్యా 2018 సెప్టెంబర్ నుండి భారతదేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడలేదు, ఆయనకు నిరంతర గాయాలు మరియు వెన్నునొప్పి కారణంగా వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. కాగా ఇప్పుడు హార్దిక్ పాండ్యా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో పాల్గొనడం లేదని వెల్లడించాడు. కాగా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్నారు.
అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు భారత్ అర్హత సాధించడంతో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు ఓవల్ వేదికగా జరిగే ఏకైక మ్యాచ్‌లో మళ్లీ వైట్ జెర్సీ ధరించేందుకు సిద్ధమా అని ప్రశ్నించగా పాండ్యా సమాధానమిస్తూ ‘నిజం చెప్పాలంటే లేదు. నేను నా జీవితంలో నైతికంగా చాలా బలంగా ఉన్నాను. అక్కడికి చేరుకోవడానికి నేను 10% చేయలేదు. నేను 1% లో భాగం కూడా కాదు. కాబట్టి నేను అక్కడికి రావడం, మరొకరి స్థానాన్ని ఆక్రమించడం నైతికంగా నాకు మంచిది కాదు. నేను టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటే, నేను గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాను, నా స్థానాన్ని సంపాదించుకుంటాను, ఆపై తిరిగి వస్తాను. నిజాయతీగా చెప్పాలంటే నా స్థానాన్ని సంపాదించుకున్నానని భావించే వరకు నేను ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లేదా భవిష్యత్తులో ఎటువంటి టెస్టు మ్యాచ్‌లు ఆడను’ అని పాండ్యా తెలిపాడు.
ఇప్పటికే పలుమార్లు టీ20ల్లో జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ 50 ఓవర్ల ఇన్నింగ్స్ లో భారత్ కు సారథ్యం వహించడం ఇదే తొలిసారి. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మ లేకుండానే భారత్ బరిలోకి వస్తుండగా మిగిలిన రెండు మ్యాచ్ లకు రెగ్యులర్ కెప్టెన్ బరిలోకి దిగనున్నాడు. కాగా తొలి వన్డేలో శర్మ లేకపోవడం కూడా టాప్ ఆర్డర్లో కొంత గందరగోళ్లన్నీ మిగిల్చింది. 2023లో 50 ఓవర్ల ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్ డ్రీమ్ రన్ అతడిని టీమ్షీట్లో మొదటి జాబితాలో చేర్చిందని, రేపు వాంఖడేలో ఇషాన్ కిషన్‌తో కలిసి ఆడతాడని కెప్టెన్ హార్దిక్ ధృవీకరించాడు.