ఆ నలుగురి నెక్స్ట్ స్టెప్ ఏంటి ?

 AP MLAS :ఆ నలుగురి నెక్స్ట్ స్టెప్ ఏంటి ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీ కి ఊహించని షాకే ఇచ్చాయి. ఎందుకంటే వాస్తవంగా చూస్తే టీడీపీ ఎమ్మెల్యేల బలం 19 మాత్రమే కానీ వైసీపీ వాస్తవ బలం చూసుకుంటే. గత ఎన్నికల్లో ఆ పార్టీ నెగ్గినవి 151 సీట్లు దానికి తోడు జనసేన ఎమ్మెల్యే జగన్ కు జై కొట్టారు. అలాగే టీడీపీ చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో అధికార పార్టీ బలం 156 పెరిగింది. ఆ పార్టీ వాస్తవ బలం చూసుకుంటే.. ఇద్దరు రెబల్ గా మారారు. నెల్లూరుకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వారిద్దరు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అనుకున్నా ఏఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ వేశారనే అనుమానంతో నలుగురు ఎమ్మెల్యేలను  సస్పెండ్ చేశారు. దీంతో వీళ్ల ఫ్యూచర్‌ ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే వేరే పార్టీలో టిక్కెట్‌ కన్ఫామ్ అయ్యిందా లేదంటే మరేదైనా హామీ వచ్చిందా అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేల రుటఎటు ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెబెల్స్‌తో పాటు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లైన్ ను క్రాస్ చేసి ఓటు వేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. దీనిని జీర్ణించుకులేని వైసీపీ శ్రేణులు నలుగురిపై భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో ఎప్పుడు ఏం జరగుుతుందోనని టెన్షన్ నెలకొంది. ఇంతవరకు ఓకే మరి ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పొలిటికల్‌ ఫ్యూచర్‌ ఏంటి ఏ హామీతో వాళ్లు క్రాస్‌ ఓటింగ్‌కు తెగించారు. ఇదే ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలో డిస్కస్‌ జరుగుతున్న పాయింట్‌.

ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి మాత్రం హైదరాబాద్‌కు మకాం మార్చారు. తనకు ప్రాణహాని ఉందని, అందుకే హైదరాబాద్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ఒక్క శ్రీదేవే కాదు మిగతా ఎమ్మెల్యేలు కూడా వైసీపీపై మనసులో మాట బయటపెడుతున్నారు. మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి అయితే సస్పెండ్ చేసినందుకు చాలా రిలాక్స్‌గా ఉంటున్నానన్నారు.

అయితే ఆ నలుగురు  ఎన్నికల ముందు మాత్రం టీడీపీలో జాయిన్ అవుతారని ఇప్పటికే అందులో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలకు టికెట్ హమీ కూడా వచ్చినట్టు సమాచారం. వారి సొంత నియోజకవర్గాల్లోనే మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా సీటుపై భరోసా లభించినట్టు టాక్ అయితే ఎక్కడ అన్నది ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని ఉదయగిరిలో చెప్పుకుంటున్నారు. మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీలో మాత్రం సమున్నత స్థానం ఇస్తామని మాత్రమే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh