ఆ ఒక్క ట్వీట్ వల్ల కన్నడ యాక్టర్ అరెస్ట్

హిందుత్వం అబద్ధాల మీద నిర్మించబడింది. సావర్కర్: రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు భారత ‘దేశం’ ప్రారంభమైంది ఇది ఒక అబద్ధం, 1992: బాబ్రీ మసీదు ‘రాముడి జన్మస్థలం’ ఇది కూడా అబద్ధం,  2023: ఉరిగౌడ-నంజేగౌడ టిప్పును ‘హంతకులు’ ఇది కూడా అబద్ధం, హిందుత్వాన్ని సత్యంతో ఓడించవచ్చు- సత్యమే సమానత్వం అంటూ హిందుత్వంపై అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అవాస్తవాలే పునాదిగా హిందుత్వ నిర్మించబడిందని ట్వీట్ చేశారంటూ హిందుత్వ అనుకూల సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చేతన్ అనే యాక్టర్‌ను బెంగళూరులో శేషాద్రిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటుడిపై ఐపీసీ సెక్షన్ 295ఏ 505బీ కింద కేసు నమోదు చేశారు.

కంప్లైంట్‌లో చేతన్ చేసిన ఆ ట్వీట్ లో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ వివరించారు. ఆ ట్విట్ట ఆధారంగా కేసు ఫైల్ చేశారు పోలీసులు. మత విశ్వాసాలను అవమానించారని, కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తేలా ఆయన ట్వీట్ ఉందని అభియోగాలు ఎదుర్కొంటున్నారు చేతన్ కుమార్.

పోస్ట్ చేసిన ట్విట్ట అర్ధం రావణుడిని రాముడు ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతే భారత జాతి అనేది మొదలైందని సావర్కర్ చెప్పారనేది ఒక అవాస్తవం అని చేతన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  అలాగే బాబ్రీ మసీదే రాముడి జన్మస్థలం అని పేర్కొనడం కూడా అవాస్తవం అంటూ పేర్కొన్నారు చేతన్. ఇప్పుడు టిప్పును అంతమొందించింది ఉరిగౌడా, నంజెగౌడాలు అని చెప్పేదీ అవాస్తవం అంటూ ఇవన్నీ అబద్ధాలే అంటూ ట్వీట్ చేసిన చేతన్‌ హిందుత్వను కేవలం నిజం మాత్రమే ఓడించగలదు, ఆ నిజం సమానత్వం అంటూ వివరించాడు.

అలా ట్వీట్ చేయగానే గంటల వ్యవధిలోనే హిందుత్వ అనుకూల సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చేతన్ కుమార్ గతంలోనూ ఇలాంటి కామెంట్స్ మరియు పోస్టలు చేయడం వల్ల  చట్టపరమైన సమస్యల్లో చిక్కుకొని ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. హిజాబ్ కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్కు వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు 2022 ఫిబ్రవరిలో ఆయనను శేషాద్రిపురం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. చేతన్ పై ఐపీసీ సెక్షన్ 505(2), 504 కింద కేసు నమోదు చేశారు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh