IPL 2023:ప్రతీకారం తీర్చుకున్నా అర్జున్ టెండూల్కర్
IPL 2023: ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ తన తండ్రి సచిన్ టెండూల్కర్‌కు 14 ఏళ్ల కిందట జరిగిన ఓ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అది కూడా ఎక్కడైతే తన తండ్రికి ఆ అవమానం జరిగిందో అదై మైదానంలో ఐపీఎల్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో అదిరిపోయే విక్టరీ సాధించింది.
ఈ ఘటన జరిగిన 14 ఏళ్ల తర్వాత IPL 2023లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ మొదట్లో మొదటి రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ చివరి ఓవర్‌లో బంతితో అర్జున్ టెండూల్కర్‌కు పెద్ద బాధ్యతను ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా అర్జున్ టెండూల్కర్ ఫైనల్ బౌలింగ్ బాధ్యతల్ని తీసుకున్నాడు.
అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి, రెండు వరుస పరాజయాల తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెమారూన్ గ్రీన్ (64 నాటౌట్), తిలక్ వర్మ (37) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 178 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (48), హెన్రిచ్ క్లాసెన్ (36) ఓ మోస్తరుగా రాణించగా ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అందరి మన్ననలు అందుకుని శభాష్ అనిపించుకున్నాడు. సన్‌రైజర్స్ గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా, అర్జున్ భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసుకుని కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైని గెలిపించాడు.
రాశవంతంగా సాగిన ఆట
తన తొలి వికెట్‌పై సంతోషం వ్యక్తం చేశాడు అర్జున్ టెండూల్కర్ ‘నా తొలి IPL 2023 వికెట్‌ను పొందడం చాలా గొప్ప విషయం. నేను చేయాల్సిందల్లా ఉన్నదానిపై దృష్టి పెట్టడం, ప్లాన్ చేయడం మరియు అమలు చేయడం. నా బెస్ట్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను.’ అంటూ కామెంట్లు చేశాడు.
అయితే, కొడుకు తొలి వికెట్ తీయడం పట్ల సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు విజయం తరువాత.. సచిన్ ట్వీట్ చేశారు. ముంబై ఇండియన్స్ మరోసారి అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిందని సచిన్ అభినందించారు. కామెరాన్ గ్రీన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ ఆకట్టుకున్నాడు. ఇషాన్, తిలక్ బ్యాటింగ్ ఎంతో బాగుంది. IPL 2023 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. గ్రేట్ గోయింగ్ బాయ్స్ అని సచిన్ ట్వీట్ చేశారు. చివరిలో అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ గురించి ప్రస్తావిస్తూ .. చివరకు టెండూల్కర్‌కి ఐపీఎల్‌లో ఒక వికెట్ దక్కింది.. అంటూ నవ్వుతున్న ఎంమోజీతో ట్వీట్ చేశారు
17 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సచిన్ ఫీల్డర్ శివకాంత్ శుక్లా షార్ట్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శివకాంత్ శుక్లా తన ఎడమవైపు డైవ్ చేసి సచిన్ టెండూల్కర్‌కు ఇచ్చిన క్యాచ్ పట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో సచిన్ కు ఇదే మొదటి డకౌట్.
ఐపీఎల్‌లో అర్జున్‌కు ఇది తొలి వికెట్. అర్జున్.. భువనేశ్వర్ కుమార్ ఔట్ చేయడం ద్వారా 14 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో తండ్రి సచిన్‌కు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. నాడు భువనేశ్వర్ కుమార్ సచిన్‌ను ఓ రంజీ మ్యాచ్‌లో ఇదే వేదికపై డకౌట్ చేశాడు. రంజీల్లో సచిన్‌ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే. తాజాగా భువనేశ్వర్ కుమార్ అదే మైదానంలో ఔట్ చేయడం ద్వారా అర్జున్, తన తండ్రికి ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.