హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందుపురం జిల్లా గార్లదిన్నేలో జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో డ్రగ్స్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని ఆరోపించారు. ఏపీలో ఉంది చెత్త ప్రభుత్వమని, నారా లోకేష్ యువగళం పాదయాత్ర కోసం అక్కడికి వెళ్ళిన బాలయ్య ఈ విధంగా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. జనం అంటే వైసీపీకి లెక్కలేదని, జగన్ కు పాలన చేతకాదన్నారు. జనం అటే జగన్‌కు కక్ష, అదో రకం సైకో తత్వం రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైసీపీ కుట్ర అని కూడా మండిపడ్డారు. వైస్సార్సీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
ఆంద్రప్రదేశ్ కు జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు ఉపాధి కల్పన లేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్ మాఫియాతో రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. వైస్సార్సీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. ఆ పార్టీ అరాచకాలను ఎదిరించేందుక ప్రజలంతా ముందుకు రావాలి.
అలాగే టీడీపీ పాలన మళ్లీ వస్తుంది, అందరి సమస్యలు పరిష్కరిస్తుంది’’ లోకేష్ పాదయాత్రకు (యువగళం) ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అన్ని వర్గాలు లోకేష్‌కు మద్దతుగా తరలి వస్తున్నారన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కళ్లు తెరవాలని.. భవిష్యత్ కోసం ఓటునే ఆయుధంగా చేసుకోవాలని పిలుపు ఇచ్చారు బాలయ్య.
కాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. చెత్తపైన కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయి. నవరత్నాల పథకాల పేరుతో కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ అప్పులు ప్రజలే తీర్చాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ ఛార్జీలు పెంచుతారు దాంతో ఆర్థిక సంక్షోభంవస్తుంది. దాంతో ఏపీ పరిస్థితి మరో శ్రీలంక అవుతుందని అంటూ ధ్వజమెత్తారు బాలయ్య.