హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్..

Hyderabad:  ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో ఫ్లైఓవర్..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడానికి, తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డిపి) కింద అనేక ఫ్లైఓవర్‌లను నిర్మించింది. నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు దశల వారిగా పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు గల మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్‌ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటి, పరిశ్రమలు శాఖామంత్రి కేటిఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్లై ఓవర్ మార్చి చివరి నాటికి ప్రారంభం కానుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా చొరవ చూపడం జరిగింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా వాటిలో ఎల్బీనగర్ ఆర్.హెచ్.ఎస్ ఫ్లైఓవర్ 19గా అందుబాటులోకి రానున్నది.

జిహెచ్ఎంసి నిధులతో చేపట్టిన పనులలో 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనులలో మూడు పూర్తికాగా మరో మూడు వివిధ ప్రగతి దశలో కలవు. గోల్నాక నుండి అంబర్ పెట్ వరకు గల ఫ్లైఓవర్ జాతీయ రహదారుల శాఖ ద్వారా ఉప్పల్ జంక్షన్ నుండి సి.పి.ఆర్.ఐ (మేడిపల్లి) వరకు గల ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి శంషాబాద్ వరకు చేపట్టనున్న ఈ రెండు 6 లైన్ల ఫ్లైఓవర్లను రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టారు. అట్టి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది.జి హెచ్ ఏం సి కి సంభందించిన రూ. 2335.42 కోట్ల విలువ గల వివిధ రకాల10 పనులలో ఫ్లై ఓవర్ లు, ఇతర పనులన్నింటినీ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగినది.

జిహెచ్ఎంసి ఎల్బీనగర్ ఆర్ హెచ్ ఎస్ ఫ్లై ఓవర్ ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్ తో పాటు భూసేకరణతో సహా మొత్తం 32 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టును మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఎయుడి) మంత్రి కెటి రామారావు ప్రారంభించనున్నారు. 12 అడుగుల వెడల్పుతో 700 మీటర్ల పొడవున్న ఫ్లైఓవర్ మూడు లేన్‌లతో విజయవాడ ఖమ్మం  నల్గొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలకు ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, నగరంలో మొత్తం ట్రాఫిక్ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. మిగిలిన మూడు ప్రాజెక్టులు – గోల్నాక నుండి అంబర్‌పేట్, ఉప్పల్ నుండి CPRI, మరియు ఆరామ్‌ఘర్ నుండి శంషాబాద్ వరకు ఇంకా  నిర్మాణం జరుగుతోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh