సోనియా గాంధీపై మండి పడ్డ ఒవైసీ

కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు, రేపు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. అన్ని  రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని అధికార బీజేపీ భారీ ప్రణాళికలు చేస్తే.. ఈ సారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎంఐఎం కూడా పలు ప్రాంతాల్లో గట్టిపోటీ ఇస్తుంది. ఇదిలా ఉంటే మాజీ బీజేపీ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన హుబ్బళి నుంచి కాంగ్రెస్ తరుపు నుంచి బరిలో నిలిచారు.  ఈ నేపధ్యం లో జగదీష్ షెట్టర్ తరుఫున సోనియా గాంధీ శనివారం ప్రచారం చేశారు.ఒకే వేదికపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జగదీష్ షెట్టర్‌లు ఉండగా, సోనియా గాంధీ శనివారం తన మూడేళ్లలో తన మొదటి ర్యాలీని నిర్వహించింది. బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని దాడి చేశారు. బీజేపీ దోపిడి, అబద్ధాలు, అహం , ద్వేషపూరిత వాతావరణాన్ని వదిలించుకోకుండా కర్ణాటక, భారతదేశం పురోగతి సాధించలేదని సోనియాగాంధీ విమర్శించారు. బిజెపి ప్రభుత్వ చీకటి పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అన్నారు.

అయితే దీనిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన జగదీష్ షట్టర్ కు సోనియాగాంధీ ప్రచారం చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూ.. ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి సోనియాగాంధీ ప్రచారం చేస్తారని తాను ఊహించలేదని ఆయన అన్నారు. ఇదేనా సెక్యులరిజం..? మోడీని ఇలాగే ఎదుర్కొవాలా.? అంటూ ప్రశ్నించారు. సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ విఫలం అవడం సిగ్గు చేటు అని ఓవైసీ విమర్శించారు. ఇలాంటి వారు తాను బీజేపీ-బీ టీమ్ అంటూ నిందిస్తారని ఎద్దేవా చేశారు.

బీజేపీ పార్టీ కీలక నేత అయినా జగదీష్ షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హుబ్బలి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుండి జగదీష్ షెట్టర్‌ను కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది. అతను బిజెపి టిక్కెట్‌పై గతంలో అసెంబ్లీ గెలిచాడు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి లౌకిక వ్యక్తి అని పేర్కొంటూ షెట్టర్ చేరికను గ్రాండ్ ఓల్డ్ పార్టీ సమర్థించింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh