రేపటి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam: రేపటి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  రేపు ఈడీ  విచారణకు హాజరవుతున్నానని తెలిపారు.ఈ రోజు  ఉదయం  హైద్రాబాద్  నుండి  కల్వకుంట్ల కవిత  న్యూఢిల్లీకి  చేరుకున్నారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతానని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటం ఆగదని, మహిళలకు తమ పార్టీతో సహా ఎవరూ ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదని కవిత అన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకే మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం డిమాండ్‌ చేస్తున్నామని కవిత పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బిల్లు కోసం ఒత్తిడిచేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలోకీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈడీ విచారణ అనంతరం కవిత ఢిల్లీ నుంచి రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే విచారణ ఇంతటితో ముగియలేదని, 16న మరోసారి హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు సూచించారు. మరోసారి హాజరు కావాల్సి ఉండడంతో ఇంకా కొంత ఆందోళనతో ఉంది. విచారణ నుంచి బయటికి వచ్చిన కవిత ఉత్సాహంగానే కనిపించారు. కార్యాలయం లోపలికి వెళ్లేటప్పుడు చేసినట్లుగానే బయటికి వచ్చినప్పుడు కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీఆర్‌ఎస్‌, భారత్‌ జాగృతి కార్యకర్తల నిరసనల నడుమ హాజరైన కవితను ఈడీ అధికారులు దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు విచారించిన ఈడీ అధికారులు.. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో  ఇప్పటికే   అరెస్టైన   అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని కోర్టు పొడిగించింది.  దీంతో  రేపు  అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి  కవితను విచారించే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  గతంలో  ఇచ్చిన వాంగ్మూలాన్ని  అరుణ్ రామచంద్రపిళ్లై  వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై  కోర్టులో  వాదనలు జరిగే సమయంలో  ఈడీ తరపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు  చేశారు. ఓ వీవీఐపీకి  నోటీసులు ఇచ్చిన తర్వాత  అరుణ్ రామచంద్రపిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారని  కోర్టుకు తెలిపారు.  పరోక్షంగా  కవిత  పేరును  ఈడీ తరపు న్యాయవాది  కోర్టు ముందు  ప్రస్తావించారు.

అయితే ఇప్పటికే కవిత వాడుతున్న పర్సనల్ ఫోన్‌ను ఇంటి నుంచి తెప్పించి మరీ ఈడీ సీజ్ చేసింది. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయానికి సంబంధించిన కీలక సాక్ష్యాలను ముందుంచి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కవిత వాడిన ఫోన్లలోని సమాచారాన్ని ఈడీ ముందుంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ సమయంలో 2 సెల్‌ఫోన్లు, 10 సిమ్‌కార్డులు మార్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్‌లో వాటాలు, రూ.100 కోట్ల ముడుపులపై ఈడీ ఆరా తీశారు. లిఖితపూర్వకంగా కూడా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh