రామ్ చరణ్, ఉపాసనలకు  శుభాకాంక్షలు తెలిపిన  కియారా అద్వానీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని దంపతులకు జూన్ 20న పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రకటించినప్పటి నుంచి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీల్లో కియారా అద్వానీ ఒకరు. సోషల్ మీడియాలో ఓ స్వీట్ నోట్ రాసింది. రామ్ చరణ్, ఉపాసన జూన్ 19న హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వచ్చారు. కొన్ని గంటల తర్వాత ఉపాసన ఆసుపత్రిలో ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా కియారా అద్వానీ కొత్త తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపింది. ‘నా ప్రియమైన ఆర్సీ, ఉప్సీ (హగ్ ఎమోజీలు) దేవుడే మీ విలువైన దేవదూతను ఆశీర్వదిస్తాడు’ అని ఆ జంట ఫొటోను షేర్ చేసింది!!! ఆమెను (హార్ట్ ఎమోజీలు) కలుసుకునేందుకు వేచి ఉండలేను’ అని ట్వీట్ చేశారు.

రామ్‌చరణ్ ఉపాసనల వివాహం 2012లో  జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయిన పదకొండు సంవత్సరల తర్వాత  ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టు మెగా, కామినేని కుటుంబాలు గతేడాది నవంబర్ 12న వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని, తాము దానికి పూర్తి భిన్నమని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం తాను, చరణ్‌.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని, బేబీ పుట్టిన తర్వాత అత్తమామల (చిరంజీవి- సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ ఎదుగుదలలో గ్రాండ్‌ పేరెంట్స్‌ కీలక పాత్ర పోషించారని, గ్రాండ్‌ పేరెంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదని వివరించారు. ఇక  రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ‘మెగా ప్రిన్సెస్ ఇక్కడే ఉంది’ అంటూ ఈ జంటను అభినందిస్తున్న అభిమానులు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh