ర‌జినీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ

Aishwarya Rajinikanth: :ర‌జినీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ

భారతీయ నటుడు సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కుమార్తె, ద‌ర్శ‌కురాలు ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ ఇంట్లో భారీ చోరీ జ‌రిగింది. అయితే ఈ విష‌యమై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.ఐశ్వ‌ర్య ఇంటికి వెళ్లి దొంగ‌త‌నం చేసేంత ధైర్యంఅసలు  ఎవ‌రికుంది? అస‌లు ఈ ప‌ని చేసింది బ‌య‌టి వ్య‌క్తులా ఇంటి దొంగ‌లా? అస‌లేం ఇంతకీ ఏమి జ‌రిగింది అనే కోణంలో తెలీసుకుంటున్నారు.  ఐశ్వ‌ర్య  వల్ల ఇంట్లో లక్ష‌లు విలువ చేసే బంగారు అభ‌ర‌ణాలు, వ‌జ్రాలు దొంగ‌తనానికి గురైన‌ట్లు తేనాం పేట‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అన్‌క‌ట్ డైమండ్స్‌, పురాత‌న బంగారు ముక్క‌లు, బంగారు వ‌జ్రాల‌తో ఉన్న చెవిపోగులు, న‌వ‌త‌ర్నం సెట్లు, ఆర‌మ్ నెక్లెస్‌, 60 స‌వ‌ర్ల బంగారు గాజులు ఇవ‌న్నీ చోరీకి గుర‌య్యాయ‌ని ఐశ్వ‌ర్య పేర్కొన్నారు.

2019లో జ‌రిగిన సౌంద‌ర్య వివాహ వేడుక‌లో ఈ అభ‌ర‌ణాల‌ను ఆమె ధ‌రించిన‌ట్లు తెలిపారు. ఆ వివాహం త‌ర్వాత వాటిని తాను బ‌య‌ట‌కు తీయ‌లేద‌ని ఆమె తెలిపారు. ఆ న‌గ‌ల‌ను పోయెస్ గార్డెన్‌లోని ర‌జినీకాంత్ ఇంట్లోని లాక‌ర్‌లో భ‌ద్ర‌ప‌రిచామ‌ని, కీ మాత్రం త‌న ద‌గ్గ‌రే ఉంద‌ని ఐశ్వ‌ర్య చెప్పారు. సెయింట్ మేరీస్ రోడ్డులో ప్ర‌స్తుతం తాను ఉంటున్న ఇంటిల్లోని ప‌ర్స‌న‌ల్ అల్మారాలో తాళం చెవిని ఉంచాన‌ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ తెలిపారు. అయితే 2023 ఫిబ్రవరి 10న తన లాకర్‌ను ఓపెన్‌ చేసి చూడగా.అందులోని కొన్ని నగలు, డైమండ్లు కనిపించలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాకైనట్లు తెలిపింది. తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్‌ వెంకట్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఐశ్వర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సెక్ష‌న్ 381 కేసు ఫైల్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ కుమార్తె,  లాల్ స‌లామ్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్నఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 8 ఏళ్ల త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఆమె ధనుష్ నటించిన 3 చిత్రంతో దర్శకురాలిగా రంగప్రవేశం చేసిన ఐశ్వర్య ఆ తర్వాత గౌతమ్ కార్తీక్ నటించిన వాయ్ రాజా వాయ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh