మంచు విష్ణుపై ఘాటు వ్యాఖ్యాలు చేసిన మనోజ్

Manchu Manoj Vs Manchu Vishnu: మంచు విష్ణుపై ఘాటు వ్యాఖ్యాలు చేసిన మనోజ్

మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చ  కెక్కాయి. మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు  మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఇంటిపై మంచు దాడి చేసిన విషయం తెలిసిందే మంచు మనోజ్‌కు సన్నిహితుడైన సారథి అనే వ్యక్తిపై మంచు విష్ణు చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపద్యం జరిగిన సంఘటను ఈ మేరకు మంచు మనోజ్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇలా ఇంటి మీదకు వచ్చి దాడి చేస్తాడంటూ విష్ణు విజువల్స్‌ను మనోజ్ షేర్ చేశాడు. అయితే ఈ విజువల్స్‌లో మంచు విష్ణు కనిపించాడు. ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా? అని విష్ణు అరుస్తున్నాడు. విష్ణుని అందరూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అంటూ తన అన్న గురించి వీడియోను షేర్ చేశాడు మంచు మనోజ్. తరువాత వెంటనే ఆ వీడియోను డిలెట్ చేశాడు మంచు మనోజ్ అయితే  విష్ణు, మనోజ్ మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది.  మంచు మనోజ్ తొలిసారి ఆ గొడవ మీద పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. మంచు విష్ణు – మంచు మనోజ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలెడన్ని వార్తలు షికారు చేస్తుంన్నాయి.  మంచు వారింట జరుగుతున్న ఈ గొడవ బట్టబయలు కావడంతో జనాల్లో డిస్కషన్స్ షురూ అయ్యాయి.

మంచు విష్ణు, మనోజ్ మధ్య  అసలు ఏం జరిగింది? అసలు గొడవకు కారణం ఏమిటి? అనేది చర్చనీయాంశం అయింది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మనోజ్ పెట్టిన ట్వీట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇవి చూసి విష్ణుతో గొడవపైనే మనోజ్ ఇలా రియాక్ట్ అయ్యారని చెప్పుకుంటున్నారు జనం. నెగిటివిటీయే క్రియేటివిటీకి శత్రువు అంటూ మనోజ్ ఓ సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో మంచు విష్ణు నెగెటివ్ గా ఆలోచిస్తున్నారనే మనోజ్ ఇలా ట్వీట్ పెట్టారని చెప్పుకుంటున్నారు నెటిజన్లు. ఏమీ జరగనట్టు అలా చూస్తూ ఉండిపోవడం కన్నా నిజం కోసం పోరాటం చేసి చావడానికైనా సిద్ధమే అంటూ మరో కొటేషన్ కూడా షేర్ చేశారు మంచు మనోజ్. మీరు బతకండి. మమ్మల్ని బతకనివ్వండి. అందరికీ ప్రేమతో అంటూ మనోజ్ ట్యాగ్ చేయడం సరికొత్త చర్చలకు తావిచ్చింది.అయితే తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు ఉంటున్నారని, మంచు మనోజ్ వేరుగా ఉంటున్నారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తోంది. గత రెండుమూడేళ్లుగా మంచు విష్ణుకి మంచు మనోజ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం,

రీసెంట్ గా జరిగిన మంచు మనోజ్  భూమా మౌనిక రెడ్డి పెళ్లి మనోజ్ అక్క లక్ష్మీ ఇంటిలో జరిగింది. అక్కడికి వచ్చి ఏదో గెస్ట్ హోదాలో  అలా వచ్చి వెలిపోయాడు. కానీ మంచు వారి సంబరాలు, వారి ఫోటోలు, వీడియోల్లో ఎక్కడా కూడా మంచు విష్ణు కనిపించలేదు. అప్పుడే అందరికీ కన్ఫామ్ అయింది. ఇలాంటి గొడవలేవో జరుగుతున్నాయని అంతా అనుకున్నారు. అయితే అసలు ఈ గొడవలు భూమా మౌనిక వల్లే ఏర్పడ్డాయా? లేదా మంచు వారి అంతర్గత విషయాలు, ఆస్తుల వల్ల జరిగిందా? అన్నది తెలియడం లేదు. అసలే మంచు విష్ణు భార్య విరానిక రెడ్డి జగన్ బంధువు. భూమా మౌనిక టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తి. ఇలా ఇంట్లోనే రెండు ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులున్నారు. ఈ గొడవల్లో ఏమైనా రాజకీయ హస్తం ఉందా? అన్నది కూడా ఇంకా తెలియాలిసివుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh