Kantara: బ్లాక్ బస్టర్ కాంతార చరిత్ర సృష్టించిoది
కాంతార ఈ పేరు తెలియని వారు ఎవ్వరు ఉండరూ. శాండల్ వుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతార. గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు ప్రేక్షకులు.16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ- 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ మూవీ . విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది కాంతార.
రిషభ్ షెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్ షెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు రిషభ్ షెట్టి స్వీయ దర్శకత్వంలోఈ సినిమాను రూపుదిద్దుకుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ కింద విజయ్ కిరగందూర్ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీనికి ప్రీక్వెల్ నిర్మించే పనుల్లో ఉంది చిత్రం యూనిట్. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇప్పుడీ కాంతార మూవీ అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. దీన్ని ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించబోతోన్నారు. స్విట్జర్లాండ్ జెనీవాలో ఉన్న యూరప్ దేశాల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఈ సినిమా స్క్రీనింగ్ కాబోతోంది. ఇప్పటికే కాంతార హీరో కమ్ దర్శకుడు రిషభ్ షెట్టి జెనీవాకు చేరుకున్నారు. ఐరాస పాథె బలెక్సెర్ట్ హాల్ నంబర్ 13లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఐరాసలో ప్రదర్శితం కాబోతోన్న తొలి కన్నడ సినిమా ఇదేనట.
అడవులు, పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాలపై ఆధారపడి జీవించే గిరిజనులు, ఆదివాసీల సమస్యలపై రిషభ్ షెట్టి- ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కథ- యూనివర్సెల్ సబ్జెక్ట్ కావడం వల్లే ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు దీన్ని అధికారికంగా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సభ్యులందరూ దీనికి హాజరుకానున్నారు. వారితో కలిసి రిషభ్ షెట్టి సినిమాను చూడనున్నారు.