నేడు డిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం

AP CM YS Jagan: నేడు డిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం ఆ అంశాలు పైనే చర్చ

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు మరో సారి ఢిల్లీ పయనవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ఈ పర్యటనలో భేటీ కానున్నారు.

ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తొంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి ఢిల్లీకి బయలుదేరతారు సీఎం జగన్. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు.

ఈ నెలలో సీఎం జగన్ ఢిల్లీ వెల్లడం ఇది రెండో సారి. ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఆ మేరకు వినతి పత్రాలను సమర్పించారు. అయితే రెండు వారాల వ్యవధిలో సీఎం జగన్ మళ్లీ ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళుతుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఆంద్రపదేశ్ ముఖ్యమంత్రి వరుస డిల్లీ పయనంతో  రాజీకియావర్గలలో రకరకాల ఆలోచనలు మొదలువుతున్నాయి . అయితే ప్రధానంగా రాజధాని అంశంలో వైసీపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపి హైకోర్టు తీర్పుపై స్టే వస్తుంది ఆ వెంటనే పరిపాలనా రాజధానిగా విశాఖను చేసి అక్కడ నుండి పాలన ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. ఇటీవల రెండు మూడు సందర్భాల్లోనూ ఆ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే అమరావతి అంశం ఇప్పట్లో తెమిలేలా కనబడం లేదు.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీని రామ్‌సింగ్‌ను తొలగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) మరోసారి హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనమై వెళ్లారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి మకాం వేయనున్నారు

అమరావతి కేసును జూలై 11వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే విశాఖ పరిపాలనా కేంద్రంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసానికి ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రధానంగా ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.

వీటితో పాటు మరో ప్రధాన అంశం పోలవరం ప్రాజెక్టు విషయం సవరించిన అంచనాలపై కేంద్రం నుండి స్పష్టత ఇవ్వకపోవడం, పోలవరం ఎత్తుపై కేంద్రం ఇటీవల చేసిన కీలక ప్రకటనపైనా చర్చించే అవకాశం ఉంది.

అయితే 2017 ఆగస్టులో పోలవరానికి సంబంధించి కొత్త అంచనాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన విషయం ఎలిసిందే.  అలాగే 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్ట్ బడ్జెట్‌ రూ.58,319 కోట్లకు చేరినట్లు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సమర్పించిన కొత్త అంచనా వ్యయానికి సీడబ్ల్యూసీ ఆమోదం లభించాల్సి ఉంది. మొత్తం వ్యయంలో పునరావాసానికి రూ.32,000 కోట్లు అవుతాయని అంచనా. పోలవరాన్ని 2014లో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు.

2017 జనవరి నాటికి పోలవరంపై రూ.8,898 కోట్లు ఖర్చు పెట్టారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత అంటే 2014 మార్చి నుంచి 2017 జనవరి వరకు ఖర్చు పెట్టిన నిధులు రూ.3,349.70 కోట్లు.  అలాగే 2014 మార్చి నుంచి 2017 జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు రూ.2,916.54 కోట్లు.  పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నాబార్డు కేంద్రానికి రుణంగా ఇస్తుంది. వీటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారు. 2014 జనవరి 1 నాటి అంచనాల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని కేంద్రం తెలిపింది.అయితే బహుశా ఈ అంశం మిద కూడా ప్రధానితో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించే అవకాశం వుంది. అయితే  ఏది ఏమైనా రెండు వారాల వ్యవధిలో రెండో సారి ప్రధాన మంత్రి మోడీని కలిసేందుకు సీఎం జగన్ వెళుతుండటం రాజీకియా వర్గ లలో హాట్ టాపిక్ గా మారింది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh