నేడు ఈడీ  ముందు హాజరైన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: నేడు ఈడీ  ముందు హాజరైన ఎమ్మెల్సీ కవిత

దేశంలో పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ముందు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉదయం 10.30 నిమిషాలకి  ఆమె ఈడీ ఆఫీసుకి వెళ్లారు. అయితే ఈ రోజు విచారణ రాత్రి 7 గంటలవరకూ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంతకు ముందు మార్చి 11న ఆమెను ప్రశ్నించిన అధికారులు మరల మార్చి 16న మళ్లీ విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు ఇచ్చారు. అయితే  14వ తేదీన ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టు వెళ్లారు. ఈ క్రమంలో కవిత పిటీషన్‌ను సుప్రీంకోర్టు ఈనెల 24న విచారణ చేస్తామని పేర్కొంది. ఈ క్రమంలో తాను దాఖలు చేసిన పిటీషన్‌ను 24న సుప్రీంకోర్టు విచారించనుందని, న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వేచిచూడాలని ఆమె ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఐతే ఆమె ఈడీ ఆఫీసుకి రాకుండా తన బదులుగా తన లాయర్‌ను పంపారు అయితే కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. దాంతో ఈడీ అధికారులు ఆమెకు మరోసారి సమన్లు జారీ చేశారు.

ఈ నెల 20న ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. అంతేకాక, అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని పెంచాలని కోరుతూ కోర్టులో ఈడీ పిటీషన్ దాఖలు చేసింది. దీంతో పిళ్లై కస్టడీని ఈనెల 20వరకు కోర్టు పొడిగించింది. అయితే  దాంతో నిన్న డిల్లీ  వచ్చిన కవిత ఈ రోజు వ్యక్తిగతంగా హాజరయ్యారు.

నిన్న ప్రత్యేక విమానంలో బేగంపేట్ నుంచి ఢిల్లీ వెళ్లిన కవితతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రి కేటీఆర్  , రాజీవ్ సాగర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు వెళ్లారు. ప్రస్తుతం వారంతా ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ  సీఎం కేసీఆర్ ఇంట్లో ఉన్నారు కవితకు తాను బినామీని అని హైదరాబాద్ చెందిన  వ్యాపారి రామచంద్ర పిళ్లై చెప్పడంతోఆ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ తర్వాత ఈజీ అధికారులు ఆమెను మరోసారి విచారణకు రమ్మంటారా లేక ఆమె విచారణను  ఈరోజుతో ముగిస్తారా లేక ఆమెను అరెస్టు చేస్తారా ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి .

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh