నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మరియు వివిధ పండుగలను పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మరియు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది, చైత్ర నవరాత్రులు, గుడి పడ్వా, నవరేహ్ పర్వదినాలను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మీ అందరికీఉగాది శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త ఆరంభాలతో ముడి పది ఉన్న ఉత్సాహబరితమైన పండగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవీతాల్లో అమితమైన ఆనందాన్నీ, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రాధిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్విటర్లో తెలుగులో పేర్కొన్నారు.
అలాగే ఇతర రాష్ట్రాలలో అక్కడ ఉన్న సాంప్రదయాల ప్రకారం కూడా మోది శుభాకాంక్షలు తెలిపారు.
కన్నడ లో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు,
సంప్రదాయ హిందీ నూతన సంవత్సరం అయిన ప్రాచీన ‘విక్రమ్ సంవత్’ ప్రారంభానికి గుర్తుగా ఈ రోజుతో, దేశం పురోగతిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్ లో ప్రత్యేకంగా జరుపుకునే సజిబు చిరోబా సందర్భంగా సింధీ కమ్యూనిటీకి ‘చెతి చంద్’ శుభాకాంక్షలు తెలిపారు.
మీ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు. భక్తితో కూడిన ఈ శుభసందర్భం దేశ ప్రజల జీవితాల్లో సంతోషం, సంపద, సౌభాగ్యాలతో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జై మాతా ది!” అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు ! pic.twitter.com/cG5Yb3D3X7
— Narendra Modi (@narendramodi) March 22, 2023
అలాగే ఈ సందర్బాన్ని పురస్కరించు కొని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ పండుగలను జరుపుకుంటున్నారు – చైత్ర నవరాత్రులు, ఉగాది, గుడి పడ్వా, సజిబు చిరోబా మరియు చెటిచాండ్. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో సంతోషం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావాలి. దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్విటర్ లో పోస్ట్ పెట్టారు.
आज देश के विभिन्न प्रदेशों में लोग अलग-अलग त्योहार मना रहे हैं – चैत्र नवरात्रि, उगादी, गुड़ी पड़वा, सजीबू चेइराओबा और चेटीचंड।
आशा करता हूं, यह नया साल आपके जीवन में सुख, शांति और समृद्धि ले कर आए।
समस्त देशवासियों को मेरी हार्दिक शुभकामनाएं।
— Rahul Gandhi (@RahulGandhi) March 22, 2023
అందరికీ ప్రజన్య మీడియా టీం ఉగాది శుభాకాంక్షలు.