తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది : కేటీఆర్

KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది

తెలంగాణలో బీజేపీ , బీఆర్ఎస్ మధ్య నిధులకు సంబంధించిన వార్ నడుస్తోంది. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమి లేదంటూ మంత్రి కేటీఆర్ లెక్కలు చెబుతున్నారు. కేంద్రం నిధులపై తన సవాల్‌కు కట్టుబడి వున్నానని అన్నారు మంత్రి కేటీఆర్. తాను చెప్పిన లెక్కలు తప్పయితే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. వేములవాడకు మోడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని. 14 మంది ప్రధానులు చేసిన అప్పు, ఒక్క మోడీనే చేశారని ఆయన దుయ్యబట్టారు. మోడీ ఎవరికి దేవుడని బండి సంజయ్‌కి , గుజరాత్ వాళ్లకు కావొచ్చునని   ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

దేశంలోనే తెలంగాణ గ్రామాలు అభివృద్ధికి చిరునామాగా మారాయని అన్నారు. సిరిసిల్లా జిల్లా వరుసగా మూడుసార్లు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లా పరిషత్‌గా నిలవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీలు సాధించిన ప్రగతి ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో పాఠ్యాంశాలుగా బోధిస్తుండటం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వరుసగా మూడుసార్లు దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచిందని కేటీఆర్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్లే ఈ పురస్కారాలు వస్తున్నాయన్నారు. ఉత్తమ గ్రామాలుగా అనేక గ్రామాలు పోటీపడుతున్నాయన్నారు. రూ. కోటి లోపు ఉన్న బకాయిలన్నీ వెంటనే విడుదల చేస్తున్నామన్నారు. మొత్తం రూ. 1300 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోందని రూ. 1200 కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నొక్కి పెడుతోందని ఆరోపించారు. కేంద్రం  మన తెలంగాణకు అవార్డులు ఇస్తోంది కానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.

పదవులు శాశ్వతం కాదు అవి వస్తువుఉంటాయి పోతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలావుండగా, సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh