టాలీవుడ్ లో మరో విషాదం మిధునం నిర్మాత ఇక లేరు

 

Mithunam Producer Death : టాలీవుడ్ లో మరో విషాదం నిర్మాత ఇక లేరు

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత మరొకరు ప్రముఖులు కన్ను మూస్తున్నారు. ఈ ఏడాది ప్రాంరభం నుంచి ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరో ఒకరు మృత్యువాతపడుతూనే ఉన్నారు. కొద్దిమంది చిన్న వయస్సులోనే గుండె పోటు కారణంగా మృతి చెందుతుండగా మరికొందరు వయసు మీద పడటం, అనారోగ్య సమస్యల వల్ల తుది శ్వాస విడుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సతీష్‌ కౌశిక్‌ గుండె పోటు కారణంగా వారం రోజుల క్రితం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఆనందరావు కన్ను మూశారు.   ఆయన వయసు 57 సంవత్సరాలు. చాలా కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతోన్న ఆనందరావు ఈమధ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడంతో వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆనందరావుకు భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం వావిలవలస అనే గ్రామంలో ఆనందరావు జన్మించారు. ఈ గ్రామంలోని తన ఇంట్లోనే ‘మిథునం’ సినిమాను చిత్రీకరించారు. కేవలం ఎస్పీ బాలు, లక్ష్మి ఈ రెండు పాత్రలతోనే ‘మిథునం’ సినిమాను తీశారు. తనికెళ్ల భరణి దర్శకత్వం వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసినప్పుడు ఆనందరావు ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఎస్పీ బాలుతో తన అనుభవాలను పంచుకున్నారు. షూటింగ్ నిమిత్తం తన సొంతూరుకు వచ్చిన బాలు, లక్ష్మి తన ఊరిలో మనుషులుగా కలిసిపోయారని వెల్లడించారు.
అలాగే కాగా, ‘మిథునం’ సినిమాకు ఆనందరావు నంది అవార్డు అందుకున్నారు. ఆనందరావు అంత్యక్రియలు వావిలవలసలో ఈరోజు జరగనున్నాయి. మొయిద ఆనందరావు మృతి చాలా బాధాకరమని మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తూర్పుకాపు సంఘం జిల్లా యువత అధ్యక్షుడు టంకాల దిలీప్‌, సంఘం నాయకులు పాలవలస శ్రీనివాసరావు, శాసపు రమేష్‌కుమార్‌. ఆర్‌వీజె నాయుడు, బెవర శ్రీనివాసరావు, జీటీ నాయుడు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు కొత్తా సాయిప్రశాంత్‌కుమార్‌, పెంకి చైతన్యకుమార్‌ తదితరులు నివాళి అర్పించారు. అలాగే ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh