జనసేన పొత్తుపై క్లారిటి ఇచ్చేసిన సోము వీర్రాజు

Somu veerraju comments alliance with Janasena

జనసేన పొత్తుపై క్లారిటి  ఇచ్చేసిన సోము వీర్రాజు

రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు(శనివారం)  సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ. కేవలం జనంతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని. జనసేన తమతో కలిసి వస్తేనే ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందని తేల్చిచెప్పారు.  ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో తమ పొత్తు ఉండదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలకు బీజేపీ సమాన దూరంలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 9 సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేస్తుంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 60 పథకాలతో ప్రజలను ఆదుకుంటోందని చెప్పారు.

తాము రోడ్లు వేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అరగ్గొట్టారు మరి . ఇప్పుడెమో  తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ తప్పిదాలపై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. అలాగే, త్వరలోనే తాము పాదయాత్ర చేస్తామని ప్రకటించారు.
ఇక అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్‌‌లు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. గతంలో తెలుగు దేశం పార్టీ సైతం అదే చేసిందని.  ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ, టీడీపీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మ బొరుసు అని, ఇవి కుటుంబ పార్టీలన్నారు. కానీ, జనసేన పార్టీ కుటుంబ పార్టీ కానే కాదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడానికి కుటుంబ పార్టీలే కారణమని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. అయితే , జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ప్రసంగాలు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్  వచ్చే ఎన్నికల్లో తమకు సరైన గౌరవం లభిస్తే టీడీపీతో పొత్తుకు సిద్ధమేనంటూ పరోక్షంగా ప్రకటించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ-బీజేపీలను ఒకచోట చేర్చేందుకు కూడా సిద్ధమన్న రీతిలో పవన్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని తెగేసి చెప్పారు. పైగా తమతో కలిసి వస్తేనే జనసేనతో పొత్తు ఉంటుందని. లేకపోతే జనంతో మాత్రమే పొత్తు ఉంటుందంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh