కోహ్లీ న్యూ లుక్‌ సూపర్‌

టీంఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. కాగా తాజాగా విరాట్‌ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఐపీఎల్ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఈవెంట్‌ కోసం బెంగళూరు చేరుకున్న కోహ్లీ ఎయిర్‌పోర్టులో కొత్తగా కనిపించాడు.

ఐపీఎల్ 2023 ముందు తన హెయిర్ స్టైల్ మార్చుకున్న అతను చేతిపై కొత్త టాటూతో కనిపించాడు. కుడి మోచేయి కింద ఉన్న ఈ టాటూ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. మధ్యలో విచ్చుకున్న పువ్వుతో ఉన్న ఈ టాటూ సూపర్‌గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. చాలా సింపుల్ డ్రెస్‌లో కనిపించిన కోహ్లీ లుక్ కూడా వారికి బాగా నచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి. ఫొటోలు చూసిన అభిమానులు ‘వావ్‌..’, ‘కోహ్లీ న్యూ లుక్‌ సూపర్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అలాగే  గతేడాది ఆసియా కప్ నుంచి మంచి ఫామ్ కనబరుస్తున్న అతను ఇప్పటికీ తన పూర్తి ఫామ్ అందుకున్నట్లు కనిపించడం లేదు. కోహ్లీ కూడా అదే విషయం చెప్పాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కోసం రెడీ అవుతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ కోసం చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నాడు. ఈ కార్యక్రమం తర్వాత ఆర్సీబీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటాడు. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ కోసం కోహ్లీతోపాటు ఈ ఫ్రాంచైజీ మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్ కూడా బెంగళూరు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలోనే గేల్, డివిల్లీర్స్ ఇద్దరినీ ‘ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చుకుంటారు. అలాగే ఈ సందర్భంగా ఆర్సీబీ నుంచి ఒక ఆసక్తికర ప్రకటన కూడా ఉంటుందని కోహ్లీ హింట్ ఇచ్చాడు. కానీ అదేంటో మాత్రం వెల్లడించలేదు.

దీంతో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన ఫామ్ గురించి తాజాగా మాట్లాడిన కోహ్లీ మళ్లీ తను పాత రోజుల్లో ఆడినట్లే ఆడటం మొదలు పెట్టానని చెప్పాడు. కానీ ఇంకా పూర్తి ఫామ్‌కు చేరుకోలేదని, ఇది తన బెస్ట్ కాదని కూడా స్పష్టం చేశాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌తో తను మళ్లీ బెస్ట్‌కు చేరుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది మంచి బలంగా కనిపిస్తున్న ఆర్సీబీ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎలాగైనా కప్పు కొట్టాలని భావిస్తోంది. అభిమానులు కూడా తమ జట్టు తొలి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గితే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh