కేజీఎఫ్ దర్శకుడు తో భారీ సినిమాను చేయనున్న ఎన్టీఆర్

Prasanth Neel : కేజీఎఫ్ దర్శకుడు తో భారీ సినిమాను చేయనున్న ఎన్టీఆర్

యాక్టింగ్ టైగర్ ఎన్టీఆర్  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన హీరో  జూనియర్ ఎన్టీఆర్. అలా తన ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా క్రమంగా పెంచుకుంటూ దూసుకెళ్తోన్నాడు. ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో భారీ సినిమాను చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే వార్తా బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

చాలా కాలం పాటు హిట్లు పడక సతమతమైన ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ తీసిన ‘టెంపర్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత.. వీరరాఘవ’ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అప్పటి నుంచి తారక్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. హిట్లు మీద హిట్లు కొడుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే RRR  మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. అంతేకాదు, దీనితో అతడి రేంజ్ ఇంటర్నేషనల్ అయిపోయింది.

ఎన్టీఆర్ RRR చేస్తున్నప్పుడే తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి అయింది. ఈ చిత్రం షూటింగ్‌ను మార్చి చివర్లో మొదలు పెట్టబోతున్నారు. RRR తర్వాత మరింత జోష్‌తో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. RRR తర్వాత మరింత జోష్‌తో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తారని ఇప్పటికే వెల్లడించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh