ఏపీ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌

Andhra Pradesh: :ఏపీ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన జగన్ సర్కార్

ఏపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తీసుకొచ్చింది.  ఇప్పటికే నేరుగా ఇంటికే రేషన్‌ సరకులను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం త్వరలోనే రేషన్‌ సరకుల జాబితాలో మరికొన్ని ఆహార ధాన్యాలను చేర్చనుంది.

ఈ విషయమై తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పలు కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిసిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధాన్యం సేకరణ అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఇస్తున్న రేషన్ కు బదులుగా రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది.. రాయలసీమ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు లను అమలు చేయనునట్లు అధికారులు తెలిపారు. అక్కడ సక్సెస్ అయితే దశల వారీగా రాష్ట్రమంతటా ఈ విధానం అమలు అవ్వనుంది. ప్రజంట్ రేషన్ కార్డు ఉన్న.. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అయితే కరోనా అనంతరం ప్రజల మైండ్ సెట్ మారింది.

ఎక్కువ ప్రొటీన్ ఫుడ్, బలవర్ధక ఆహారం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రైస్ బదులు పోషక విలువలున్న ఇతర ధాన్యాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఐక్యరాజ్యసమితి కూడా 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి. ఆ దిశగా ప్రోత్సహిస్తోంది.

అన్న మంత్రి మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నా సంవత్సర కాలంలో సివిల్ సప్లై మంత్రిత్వశాఖలో అనేక మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. రైతులకు దళారి వ్యవస్థను దూరం చేయడంతో పాటు రైతులకు సరైన పంట ధర వచ్చేలా చేశామన్నారు. నేరుగా రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తున్నామని, దీంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఏపీలో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆపైన ఎంత వచ్చిన సేకరిస్తామని హామి ఇచ్చారు. ఇంటింటికి రేషన్ పంపిణీ విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ని కేంద్ర మంత్రి ప్రశంసించారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. త్వరలోనే ఏపీ ప్రజలకు రేషన్‌ సరఫరాలో గోధుమ పిండి, రాగులు, జొన్నలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

అయితే పంపిణీకి అవసరమైన రాగులు, జొన్నలను సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తోంది పౌరసరఫరాల శాఖ. కేజీ గోధుమ పిండి ప్యాకెట్ రేటును రూ.16 గా ఫిక్స్ చేశారు. విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం మునిసిపాలిటీల పరిధిలో సబ్సిడీపై గోధుమ పిండి అందజేస్తున్నారు.. ఒక్కో కార్డుపై 2 కేజీల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని అందజేస్తారు.బయట గోధుమ పిండి ధర రూ.40గా ఉంది. కానీ గవర్నమెంట్ రూ.16కే అందజేస్తోంది. మిగిలిన జిల్లాల్లో కూడా గోధుమ పిండిని అందించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh