ఏపీ పింఛన్ దారులకు బ్యాడ్ న్యూస్

ఏపీ పింఛన్ దారులకు బ్యాడ్ న్యూస్….ఏప్రిల్‌  నెలలో పింఛన్ ఇక అప్పుడే
ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెల ఏప్రిల్‌లో రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ ఇస్తామని సీఈవో ఇంతియాజ్ వెల్లడించారు.

ప్రతినెల 1వ తేదీన పింఛన్లను ఇచ్చే ఏపీ ప్రభుత్వం, ఏప్రిల్ నెలలో మాత్రం పింఛన్ ను ఏప్రిల్ మూడవ తేదీ నుండి పంపిణీ చేయనున్నట్టు పేర్కొంది.

మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి, ఏప్రిల్ ఒకటి నుండి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న కారణంగా, ఇక రెండవ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయని కారణంగా, మూడవ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వెల్లడించారు. ఒకటవ తేదీన తమకు పింఛన్ రాలేదని లబ్ధిదారులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నెలలో పింఛన్ పంపిణీ తేదీ మార్పుని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందే ఏపీ క్యాబినెట్ సమావేశం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించిన మంత్రి, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుండి వృద్ధాప్య పింఛన్ ను ఏపీ ప్రభుత్వం పెంచింది. 2750 రూపాయలకు పెంచి జనవరి ఒకటో తేదీ నుండి పంపిణీ చేస్తుంది. అంతకుముందు 2500 రూపాయలు ఉండగా ఇప్పుడు 50 రూపాయలు పెంచి పెన్షన్ అందిస్తున్నారు.

2024 జనవరి నాటికి మూడు వేల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అంతేకాదు లబ్ధిదారులు ఒక చోట నుండి మరొక చోటికి తమ నివాసాన్ని మార్చుకున్నా, పింఛన్ కూడా అక్కడికి మార్చుకునేలా నిర్ణయం తీసుకుంది .ఈ మేరకు లబ్ధిదారులు తమ వివరాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొని, పింఛన్ ను మార్చుకోవచ్చు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh