ఏపీ అసెంబ్లీలో వైసీపీ తీరుపై స్పందిచ్చిన జనసేనాని

Pawan Kalyan :ఏపీ అసెంబ్లీలో వైసీపీ తీరుపై స్పందిచ్చిన జనసేనాని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. అదే సమయంలో బయట రెండు పార్టీల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉద్రిక్త ఘటనలపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగా స్పందించారు. అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటని వైసీపీని ఉద్దేశించి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పవన్‌ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే ఈ పరిణామాలు దురదృష్టకరమైనవి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవి. ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చను కోరిన ప్రతిపక్ష టీడీపీ శాసన సభ్యులపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. ఎమ్మెల్యేలు డి.బి.వి.స్వామి, జి.బుచ్చయ్య చౌదరిలపై దాడిని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఆక్షేపించాలి. చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తాం. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్చ చేయాలి. చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విధమైన దాడులు చట్టసభల నుంచి వీధుల్లోకి వస్తాయి. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైడింగ్ ఆఫీషియల్స్ మీదా ఉంది. అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

కాగా టీడీపీ సభ్యుల ప్రవర్తన దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ మంత్రి ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి మేరకు ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తనపై దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. గత రెండేళ్లలో తనపై పలుమార్లు దాడి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

సభలో జరిగిన ఘర్షణలపై స్పందించిన స్పీకర్ సభ గౌరవాన్ని, హోదాను దిగజార్చే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఈ తీర్పు ఇచ్చామని ఆయన అభిప్రాయపడ్డారు. సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ పోడియం వద్దకు రావొద్దని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం సభలో కీలక తీర్పు ఇచ్చారు. అదే జరిగితే ఆటోమేటిగ్గా సస్పెండ్ చేస్తామని చెప్పారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh