అల్లు అర్జున్ కారణంగా కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక

Allu Arjun: అల్లు అర్జున్ కారణంగా కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2021 లో విడుదలై ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా  చెప్పవలసిన పనిలేదు అయితే ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా  అల్లు అర్జున్  రష్మిక మందన్నా లు హీరో హీరోయిన్ గా నటించారు. అంతేకాదు ఇందులో విలన్ గా కమెడియన్ సునీల్ అలాగే అనసూయ, నటుడు ఫహాద్ ఫాజిల్ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించి సినిమాకి మంచి హైప్ ని క్రియేట్ చేశారు.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్  స్టైల్ కి చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు  ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. అంతేకాదు సినిమా విడుదలయ్యాక చిన్నపిల్లవాడి నుండి ముసలి తాతదాక అందరూ తగ్గిదేలే అని డైలాగ్ అంటూ ఆ డైలాగ్ ని చాలా ఫేమస్ చేశారు. ఇక ఈ సినిమాలోని పాటలన్నీ మ్యూజికల్ గా చాలా హీట్ అయ్యాయి. అంతేకాదు ఈ పాటలు సినిమాకి కూడా ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ పాటలకి కేవలం ఇండియా లోనే కాదు దేశ విదేశాలకు చెందిన చాలామంది సెలబ్రిటీలు కూడా చిందులేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా మొదట్లో ఒకటే అని చెప్పారు.కానీ ఆ తర్వాత మధ్యలో రెండో భాగం కూడా ఉంటుందని సప్రైజ్ ఇచ్చారు. ఇక పుష్ప 2  సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్లో రష్మికని అల్లు అర్జున్ చాలా ఘోరాతి ఘోరంగా అవమానించారని సమాచారం.

అంతేకాదు రష్మిక అల్లు అర్జున్ చేసిన అవమానాన్ని తట్టుకోలేక షూటింగ్ సెట్ నుండే ఇంటికి వచ్చేసిందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అల్లు అర్జున్ కారణంగా రష్మిక కన్నీళ్లు పెట్టుకుందని,షూటింగ్ని వదిలేసి ఇంటికి వెళ్ళింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh