Hyderabad: పాత బస్తీలో కాల్పుల కలకలం
ఒకరి మృతి
తెలంగాణ, ఏపీలో గన్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతుంది. అమెరికా లో ఎక్కువగా కనిపించే ఈ కల్చర్ఇ ప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనూ చాపకిందనీరులా విస్తరిస్తోంది. హైదరాబాద్ లో అర్దరాత్రి కాల్పులు కలకలం రేపాయి. టప్పాచబుత్రా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ప్రత్యర్థులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. పాత కక్షల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కార్వాన్‌లోని షబాబ్ హోటల్ సమీపంలోని తోప్ఖానాలోదుండగులు 26 ఏళ్ల ఆకాష్ సింగ్‌పై కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మరణించాడు.
దాడి చేసిన వ్యక్తులు ఆకాష్ సింగ్‌పై పలుసార్లు కాల్పులు జరిపి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో పాటు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ నేరానికి ఇంట్లో తయారు చేసిన ఆయుధాలు ఉపయోగించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆకాష్ సింగ్, అకా ఛోటు, అతని బంధువు క్రాంతిపై గతంలో దాడి చేశాడు, దీంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది.
అసలు వివరలోకి వెళ్ళితే మంగళవారం రాత్రి, క్రాంతి ఆకాష్ సింగ్‌తో రాజీ కుదుర్చుకోవడానికి కార్వాన్‌లోని తోపేఖానా ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే కామన్ ఫ్రెండ్‌ని సంప్రదించాడు. అనంతరం ఆకాష్‌ను ఇమ్రాన్ తన నివాసానికి పిలిపించగా, క్రాంతి, అతని సహచరులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాజీ సాకుతో, క్రాంతి అకస్మాత్తుగా ఆయుధాన్ని తీసి ఆకాష్ సింగ్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అక్కడిక్కడే మరణించాడు.
సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ఆకాశ్ సింగ్ కు క్రాంతి కుమార్ కు మధ్య కొంత కాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం క్రాంతిపై ఆకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన నిందితుడు ఎలాగైనా ఆకాశ్ ను అంతమొందించాలని కక్ష కట్టాడు. పక్కా పథకం ప్రకారమే బిహార్ నుంచి రెండు నెలల కిందట తుపాకీని కొని తెచ్చుకున్నాడు. ఈ దారుణానికి తన స్నేహితుడు చంద్ర జోషి సాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి మంగళవారం అర్థరాత్రి ఆకాశ్ ను కిరాతకంగా హత్య చేశారు. గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. అక్కడి నుంచి కత్తులు, హత్యకు ఉపయోగించిన తుపాకీని వారు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ప్రధాన నిందితుడైన క్రాంతి కుమార్ పై 307 కింద కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా డీసీపీ కిరణ్ వెల్లడించారు.