రజనీకాంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
Kodali Nani Counter: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యఅతిధి గా వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. వరుస వైసీపీ ఫైర్ బ్రాండ్స్ రజనీకాంత్ లక్ష్యంగా తీవ్ర విమర్శలకు దిగారు. తాజాగా విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్ ఎన్టీఆర్ తో తన అనుబంధం వివరిస్తూనే చంద్రబాబు పైన ప్రశంసలు గుప్పించారు. చంద్రబాబు విజన్ అమలైతే ఏపీకి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. రాజకీయాలు మాట్లాడను అంటూనే చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గుశరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దించాడని, చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలని కొడాలి నాని సూచించారు.
ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజినీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడడం సిగ్గుచేటు అన్నారు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలేవరూ పట్టించుకోరని Kodali Nani Counter చేశారు. ఎన్టీఆర్ బతికుండగా రజినీకాంత్ ఏం చేశాడు..? ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటూ నాని ప్రశ్నించారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తాడని కొడాలి నాని ఘటుగా విమర్శలు చేశారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజినీకాంత్ చదువుతూ తను వ్యక్తిగా మరింత దిగజారుతున్నాడంటూ నాని అన్నారు.
ఇప్పటికే మరో వైసీపీ మంత్రి రోజా సైతం రజినీకాంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల గురించి రజినీకేం తెలుసని ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా కొడాలి నాని కూడా ఆయనపై మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల గురించి రజనీకాంత్‌కి ఏం తెలుసు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆయన సినిమాల్లో సూపర్ స్టార్ కావచ్చు. ఏపీ రాజకీయాల్లో మాత్రం ఆయనకు అవగాహన లేదని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ వెంటిలేటర్‌పై టీడీపీకి మద్దతు కోసం తీసుకుని వచ్చాడు అంటూ విమర్శించారు. 2047లో ఏదో చేస్తారని రజనీకాంత్ చెప్తున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు. ఐదేళ్లు అమరావతిలో టెంపరరీ కట్టడాలు కట్టి అభివృద్ధి చేయకుండా ఉన్నది రజినీకాంత్ కి తెలియదా అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.