మరొక ఆస్కార్‌ వచ్చేది మోడీని పంపితే :మంత్రి కేటీఆర్‌

Minister KTR: మరొక ఆస్కార్‌ వచ్చేది మోడీని పంపితే :మంత్రి కేటీఆర్‌

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గారు బీజేపీ, ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ అని ఆరోపించారు. మోడీ, ఈడీ, బోడీకి ఎవరికీ భయపడేది లేదన్నారు. ఎవరికీ భయపడేది లేదని ఏం పీక్కుంటారో పీక్కోండి అని కేటీఆర్ హెచ్చరించారు.  తాము ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేశారో 2023లో ప్రజలే తీర్పు చెబుతారని సవాల్‌ విసిరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు వ‌చ్చింది.

అయితే మన దేశంలో మోడీ అనే మహానటుడున్నారు. ఆయన్ను పంపితే మనకు మరో ఆస్కార్‌ వచ్చేది. మోడీలో అద్భుత‌మైన మ‌హాన‌టుడు ఉన్నారు. 2014లో ఎన్నో మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చారు. దేశం మొత్తం సంప‌ద దోచి వాళ్ల దోస్తుల ఖాతాలో వేస్తున్నారు. వారి దగ్గర చందా తీసుకోని ప్రతిపక్ష పార్టీల మీద ప‌డుతున్నారు. పార్టీల‌ను చీల్చి దేశాన్ని ఆగం చేయాల‌ని చూస్తున్నారు. ఆయ‌న‌ను మ‌హాన‌టుడు అని ఉట్టిగానే అన‌లేదు. ఇక ఆదాయం డ‌బుల్ చేస్తానన్నారు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు కానీ  ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు న‌ల్లధనం తెస్తాన‌ని చెప్పారు .

మోదీ హయాంలో సిలిండర్ ధర రూ.1200లకు చేరిందని, సిలిండర్ ధర పెంచి హామీ తప్పిన ప్రధానిని ఏమనాలి?, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు కర్రు కాల్చి వాత పెడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే అడిగితే తెల్ల మోహం వేస్తున్నారు’ అని మోడీపై సెటైర్లు వేశారు కేటీఆర్  ఇదే సభలో కాంగ్రెస్‌పై కూడా ధ్వజమెత్తారు కేటీఆర్‌. ’50 ఏళ్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేయలేదు. మళ్లీ ఇప్పుడు పాదయాత్రలు చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. నిన్న మొన్నటి దాకా మ‌నల్ని చావగొట్టింది కాంగ్రెసోళ్లే. అస‌లు వారికి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్‌లు. అధికారంలో ఉన్నన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పండ్లు తోమారా? అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల మోస‌పూరిత మాట‌ల‌కు మోసపోవ‌ద్దు’ అని జుక్కల్‌ నియోజ‌క‌వ‌ర్గ ప్రజలకు సూచించారు కేటీఆఅని జుక్కల్‌ నియోజ‌క‌వ‌ర్గ ప్రజలకు సూచించారు కేటీఆర్‌.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh