Hyderabad :కోటి ఉమెన్స్ కాలేజీకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి
ఈ రోజు హైదరాబాద్’ కోటి ఉమెన్స్ కాలేజీలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక్ష మయ్యారు. అయితే చిరుకు ఉమెన్స్ కాలేజీలో ఏంటి పని అనుకుంటున్నారా? చిరు ఇంకా ఏం పని ఉంటుందండి, షూటింగ్ కోసమే. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు చేస్తున్న లేటెస్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ఇది. ఈ చిత్రం కోసం మిల్కీ బ్యూటీ తమన్నాతో జతకట్టనున్నారు మన మెగాస్టార్. అంతే కాదు ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటిస్తుంది. ఈ రోజు హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. కోటి ఉమెన్స్ కాలేజీ లోదీనికి సంబంధించిన చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. చిరంజీవి సెట్లో మహానటి కీర్తి సురేష్ చేరనుంది ఆమె కోటి ఉమెన్స్ కాలేజీకి వచ్చే కాలేజ్ స్టూడెంట్‌గా ఈ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాలో కీర్తికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది, ఈ ఇద్దరు ప్రతిభావంతులైన నటులు పెద్ద స్క్రీన్‌పై సృష్టించే మ్యాజిక్‌ను మనం ఊహించవచ్చు.
తమన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, తులసి, ప్రగతి, బిత్తిరి సత్తి, సత్య, ఉత్తేజ్, ప్రభాస్ శీను వంటి తారాగణంఈ సినిమాలో నటిస్తున్నారు.
వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచినా వాల్తేరు వీరయ్య సినిమాతో అదరగొట్టారు మెగాస్టార్ చిరు . ఇక ఆ సినిమా తర్వాత త్వరలో భోళా శంకర్ సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు మెగాస్టార్. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని టాక్. విడుదలకు ముందే రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా ఓవరాల్‌గా జరిగే బిజినెస్‌తో పాటు థియేట్రికల్ రన్ షేర్ మొత్తం చూసిన తర్వాత పర్సెంటేజ్ పరంగా రెమ్యునరేషన్‌ను తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నారట. ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. కీర్తి సురేష్ కీలకపాత్రలో కనిపించనుంది. తమన్నా హీరోయిన్గా చేస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తమిళ వేదాళం సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.