గడప గడపకు జగన్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహరచన మొదలుపెట్టిన పొలిటికల్ పార్టీలు దీనితో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసలు నారా లోకేశ్ ఇప్పటికే పాదయాత్ర మొదలుపెట్టగా, పవన్ కళ్యాణ్ వారాహిలో బస్సు యాత్ర ప్రారంభించనున్నాడు. దీంతో అధికార పార్టీ కూడా అప్రమత్తమై తమ ప్రభుత్వ పథకాలు పొందిన ప్రతి ఇంటికి ‘మా నమ్మకం నువ్వే’ జగన్ పేరిట స్టిక్కర్లను అతికించాలని భావిస్తోంది. అలాగే సీఎం జగన్ సైతం స్వయంగా రంగంలోకి దిగుతారట ఏప్రిల్ నుంచి సీఎం బస్సు యాత్రను ప్రారంభించే ఛాన్స్?వుంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఏపీ సీఎం జనంలోకి వెళ్తారని తెలుస్తోంది.
ఇంకా ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పుడే ఎన్నికలకు సిద్దమవుతున్నారు.ఈ నేపథ్యంలో అధికార పార్టీ సైతం రేసులోకి వచ్చింది. అసలు జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్సీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. దీంతో తమ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారి ఇళ్లలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను అతికించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తమ పార్టీతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందని.
అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడంతోపాటు. మళ్లీ జగనే అధికారంలోకి రావాలనే సానుకూల భావనను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం అధికార పార్టీ ఈ కొత్త స్లోగన్ను తీసుకొచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదం ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ‘మా నమ్మకం నువ్వే’నంటూ జనాలను తమవైపు తిప్పుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నాలు. ప్రతిపక్షాలు ‘సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి’ లాంటి స్లోగన్లతో వైఎస్సార్సీపీ సర్కారుపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం అధికార పార్టీ వ్యూహకర్తలు ఈ నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చాయి. ఇందులో భాగంగా ప్రతి మండలాన్ని టచ్ చేసేలా ముఖ్యమంత్రి పల్లె నిద్ర చేసేలా అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. ఈ సందర్భంగా సీఎం జగన్ నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకొని సాధ్యమైనంత తర్వగా పరిష్కరించనున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని జగన్ ఇంతక ముందే చెప్పారు.
ఇది కూడా చదవండి :