Wrestlers’ Protest: రెజ్లర్లకు మద్దతు పలికిన 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్
Wrestlers’ Protest: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్ల చేస్తోన్న ఆందోళనకు క్రమక్రమంగా అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది.
ఇప్పటికే ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలవగా, తాజాగా రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నవారిలో 1983 వరల్డ్ కప్ నెగ్గిన భారత మాజీ క్రికెటర్లు చేరారు.
కపిల్‌దేవ్ నేతృత్వంలో ఈ బృందం సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేసింది.
ఢిల్లీలో భారతదేశపు ఛాంపియన్లు అయిన మహిళా రెజ్లర్లను మ్యాన్ హ్యాండిల్ చేసిన తీరును చూసి మేం చాలా ఆవేదనకు గురయ్యాం.
‘మన చాంపియన్ రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే చాలా బాధ వేసింది.
ఎంతో కష్టపడి సాధించిన పతకాలను వారు గంగానదిలో పడేయాలనే ఆలోచనకు రావడం ఎంతో బాధపెట్టింది.
ఎందుకంటే ఆ పతకాల్లో ఏళ్ల తరబడి చేసిన శ్రమ, త్యాగాలు, సంకల్పం దాగి ఉంటుంది.
అంతేగాక వారు గెలిచిన పతకాలు వారికే కాదు, దేశానికే గర్వకారణం.
అయితే తమ పతకాలను పడేయడం వంటి తీవ్రమైన పనులు చేయవద్దని రెజ్లర్లను కోరుతున్నాం.
ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తాము రెజ్లర్లను కోరుతున్నాం.
1983 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుల్లో ఒకరైన మదన్‌లాల్ అన్నారు.
వారి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు.
అయితే ఈ ‘సంయుక్త ప్రకటన’తో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ఈ జట్టులో సభ్యుడైన బీసీసీఐ Wrestlers’ Protest: అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పష్టం చేశారు.
అయితే రెజ్లర్ల సమస్యను పరిష్కరించడానికి అధికారులు కృషి చేస్తున్నారని మాజీ క్రికెటర్‌గా నమ్ముతున్నానని, స్పోర్ట్స్‌ని రాజకీయాలతో కలపకూడదని అభిప్రాయపడ్డారు.
అయితే మరో వైపు నిందితుడిని ప్రధాని మోదీ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
’25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిన మన బిడ్డలు Wrestlers’ Protest: న్యాయం కోసం వీధికెక్కారు.
15 తీవ్ర ఆరోపణలతో రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన వ్యక్తి ప్రధాన రక్షణ కవచంలో ఉన్నాడు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.