మనం ప్రతిరోజూ అనేక రకాల పండ్లను తింటాం. కానీ మనం కొన్ని రకాల పండ్లతో పాటు ఇతర రకాల పండ్లను తింటాం. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. ఈ పండు శరీరానికి అవసరమైన పొటాషియం, కాల్షియంను అందించి శరీర కండరాలను బలోపేతం చేస్తుంది. బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఈ రెండు పండ్లు వాటి స్వంత లక్షణాలను కలిగి ఉంటాయి. అదనంగా ఇవి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అరటిపండు, బొప్పాయి వేర్వేరు స్వభావాలు కలిగిన రెండు పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
వాంతులు, అలెర్జీలు, అజీర్ణం వంటి సమస్యలు సంభవించవచ్చు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అరటిపండ్లు, బొప్పాయి కలిపి తినడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు ఎక్కువ వస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ పండ్ల కలయిక అనేక రకాల సమస్యలను తీవ్రతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కామెర్లు ఉన్నవారు బొప్పాయి తినకూడదని వైద్యులు అంటున్నారు. ఇందులో ఉండే పపైన్, బీటా కెరోటిన్ కామెర్లు సమస్యను పెంచుతాయని చెబుతున్నారు.
ఇక శరీరంలో పొటాషియం అధికంగా ఉంటే అరటిపండ్లు తినకూడదు. బొప్పాయిని, అరటిపండును విడివిడిగా తినడం శరీరానికి మంచిది. ఆయుర్వేదం ప్రకారం అరటిపండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఇవి రెండు పరస్పరం విరుద్ద లక్షణాలు కలిగిన పండ్లు. ఇక ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ క్షీణించి తలనొప్పి, వాంతులు, తలతిరుగుడు, అలెర్జీలు, అజీర్ణం మొదలైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిని తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అరటిపండు, బొప్పాయి వేర్వేరు స్వభావాలు కలిగిన రెండు పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల వాంతులు, అలెర్జీలు, అజీర్ణం, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి.