ప్రాణాపాయ స్థితి లో పీజీ మెడికో ప్రీతి
సీనియర్ విద్యార్థుల వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్యాయ్నానికి పాల్పడిన వరంగల్ జిల్లా కేఎంసీ మెడికో పీజీ యూనివర్సిటీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ప్రీతికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం సహకరించడం లేదని చెబుతున్నారు. బీపీ పల్స్ రేట్ నమోదు కానీ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు ప్రీతికి డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలోని ఐదుగురు డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. బుధవారం రాత్రి ప్రీతి టెస్ట్ రిపోర్ట్స్‌ను డాక్టర్ పద్మజ పరిశీలించారు.వరంగల్ నుండి ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలోనే రెండుసార్లు గుండె ఆగిపోయింది. వెంటనే వైద్యులు సీపీఆర్ చేసి గుండె కొట్టుకునేలా చేశారు. అనేస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, ఇతర డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేం’ అని డాక్టర్లు తెలిపారు.
ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో సీనియర్ వేధింపులు భరించలేక. గట్టిగా మాట్లాడితే ఎక్కడ మార్కులు తగ్గిస్తారోనని భయపడింది. అలాగే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా వేధింపులు తగ్గలేదు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే తనలోతాను కుమిలిపోయి ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది.
అదీ ఆస్పత్రిలో డ్యూటీగా ఉండగా జరగడంతో కలకలం సృష్టించింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా చిన్న కుమార్తె అయిన ప్రీతి(26) ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని కేఎంసీలో అనస్తీషియా పీజీ కోర్సులో 2022లో చేరింది. ప్రస్తుతం థియరిటికల్ క్లాస్‌లు జరుగుతున్నాయి.
అనస్తీషియా వైద్య విభాగ డ్యూటీ చార్టులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ఎస్ఆర్, ఒక సీనియర్ పీజీ, ఇద్దరు జూనియర్ పీజీ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారు. కొన్ని రోజులుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తోంది.
అయితే ఇక్కడ పరిచయమైన సీనియర్ సైఫ్ కొంతకాలంగా వేధిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ మోహన్‌దాసు ఆదేశాల మేరకు అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం సైఫ్, ప్రీతిలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెకు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనే అనుమానం కలుగుతోంది.
ఆమె విద్యలో ఎదురయ్యే ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే విద్యార్థిని + కాదని బంధుమిత్రులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలోనూ సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో ఉద్యోగులకు సేవలందించిందని తెలిపారు. ప్రీతి తండ్రి రైల్వే విభాగంలో చేస్తున్న క్రమంలో తన తండ్రితో విధులు నిర్వర్తిస్తున్న వారి ఆరోగ్య సంరక్షణకు సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో విస్తృత సేవలందించిందని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిందో ఎవరూ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ప్రీతి అనస్తీషియా ఇంజక్షన్ల సమాచారం కోసం తన సెల్ఫోన్లో తీవ్రంగా సెర్చ్ చేసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్న సందర్భంలో తీసుకునే ట్రెమడాల్ ఇంజక్షన్ తీసుకున్నట్లు కొందరు వైద్యులు పేర్కొంటున్నారు.
కానీ ప్రీతి ట్రెమడాల్ ఇంజక్షన్ కాకుండా అనస్తీషియా తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్టుతోపాటు తన శరీరంలో పలు అవయవాలు పనిచేయకుండా పోయాయని మరికొందరు వైద్యులు చర్చించుకుంటున్నారు. ఆరు నెలల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో అనస్తీషియా ఇంజక్షన్ వికటించిన సందర్భంలో సైతం ఇద్దరు రోగులు కార్డియాక్ అరెస్టు కావడం వల్ల చనిపోయిన సందర్భాలను 54. గుర్తుచేసుకుంటున్నారు. ప్రీతికి డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలోని ఐదుగురు డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. అలాగే ఈ రోజు సాయంత్రం ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మరో హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది.
అలాగే ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేధింపులు అయితే విచారణ కేసు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా స్పందించారు. సీపీ రంగనాథ్‌తో మాట్లాడి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి :